US Open 2026: జకోవిచ్‌కు ఊహించ‌ని షాక్ | Novak Djokovic crashes out of US Open in first round to unseeded Navone | Sakshi
Sakshi News home page

US Open 2026: జకోవిచ్‌కు ఊహించ‌ని షాక్

Aug 31 2026 10:47 AM | Updated on Aug 31 2026 12:09 PM

Novak Djokovic crashes out of US Open in first round to unseeded Navone

యూఎస్ ఓపెన్‌-2026లో టెన్నిస్ దిగ్గజం నొవాక్‌ జకోవిచ్‌కు తొలి రౌండ్‌లోనే ఊహించ‌ని షాక్ త‌గిలింది. అర్జెంటీనాకు చెందిన యువ ఆటగాడు మరియానో నవోనె చేతిలో 7-6 (7/5), 5-7, 4-6, 6-2, 6-1 తేడాతో జకోవిచ్ ఓట‌మి చ‌విచూశాడు. 

సుదీర్ఘంగా సాగిన ఈ ఐదు సెట్ల పోరులో ఓడిపోవడంతో, జకోవిచ్ తొలి రౌండ్‌లోనే టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టాడు. దీంతో 25వ మేజర్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలవాలన్న జకోవిచ్‌ కలలు ఆదిలోనే కరిగిపోయాయి. ‌

ఆది నుంచే ఇబ్బందిపడ్డ జొకోవిచ్‌
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆర్థర్‌ ఆషే స్టేడియం కప్పును పూర్తిగా మూసివేయగా.. 39 జకోవిచ్‌ వేడిమి తట్టుకోలేక ఇబ్బంది పడ్డాడు. పదే పదే తలపై ఐస్‌బ్యాగ్‌ పెట్టుకుని ఉపశమనం పొందే ప్రయత్నం చేశాడు. అంతేకాదు.. కాసేపు ఏసీ వేయాలంటూ సూపర్‌వైజర్‌ను కోరాడు.

ఇక చివరి సెట్‌కు ముందు మెడికల్‌ టైమ్‌ అవుట్‌ కూడా తీసుకున్నాడు. వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు వైద్య బృందాన్ని పిలిపించుకున్నాడు. కానీ మునుపటిలా మైదానంలో కదల్లేకపోయాడు. ఈ క్రమంలో జకోవిచ్‌పై పూర్తి ఆధిపత్యం కనబరిచిన నవోనె సులువుగానే మ్యాచ్‌ గెలిచాడు.

భావోద్వేగం
తొలి రౌండ్‌లోనే ఓటమి నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి గురైన జకోవిచ్‌.. మైదానం వీడే సమయంలో అభిమానులకు అభివాదం చేశాడు. ప్రేక్షకులు లేచి నిలబడి అతడికి భావోద్వేగంతో వీడ్కోలు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement