పెగూలా శుభారంభం | Jessica Pegula makes a good start in the US Open | Sakshi
Sakshi News home page

పెగూలా శుభారంభం

Aug 31 2026 3:46 AM | Updated on Aug 31 2026 3:46 AM

 Jessica Pegula makes a good start in the US Open

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ మహిళలసింగిల్స్‌ విభాగంలో 2024 రన్నరప్, ప్రపంచ మూడో ర్యాంకర్‌ జెస్సికా పెగూలా (అమెరికా) శుభారంభం చేసింది. ఎలీనా గాబ్రియేలా రూసె (రొమేనియా)తో ఆదివారం జరిగిన తొలి రౌండ్‌లో పెగూలా 6–3, 6–2తో గెలిచింది. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పెగూలా నాలుగు ఏస్‌లు సంధించింది. 

26 విన్నర్స్‌ కొట్టిన పెగూలా ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. మరోవైపు ప్రపంచ 29వ ర్యాంకర్, రెండు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ విజేత క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. క్రెజికోవా 6–7 (4/7), 2–6తో కమీలా రఖిమోవా (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement