నగాల్‌కు నిరాశ | Sumit Nagal loses in US Open Grand Slam tennis qualifying tournament | Sakshi
Sakshi News home page

నగాల్‌కు నిరాశ

Aug 27 2026 3:42 AM | Updated on Aug 27 2026 3:42 AM

Sumit Nagal loses in US Open Grand Slam tennis qualifying tournament

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భారత నంబర్‌వన్‌ ర్యాంకర్‌ సుమిత్‌ నగాల్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 86వ ర్యాంకర్, క్వాలిఫయింగ్‌ ‘డ్రా’లో టాప్‌ సీడ్‌ ప్లేయర్‌ ఆర్థర్‌ గియా (ఫ్రాన్స్‌)తో జరిగిన మ్యాచ్‌లో సుమిత్‌ నగాల్‌ 3–6, 6–7 (4/7)తో ఓడిపోయాడు. 1 గంట 49 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నగాల్‌ 12 విన్నర్స్‌ కొట్టి, 27 అనవసర తప్పిదాలు చేశాడు. 

తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్‌ చేశాడు. తాజా ఓటమితో 29 ఏళ్ల నగాల్‌ ఈ ఏడాది ఒక్క గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలోనూ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. గత ఏడాది ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ మెయిన్‌ ‘డ్రా’లో ఆడి తొలి రౌండ్‌లో ఓడిన నగాల్‌ కెరీర్‌ మొత్తంలో ఎనిమిదిసార్లు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మెయిన్‌ ‘డ్రా’లో బరిలోకి దిగాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement