రన్నరప్‌ శ్రీకాంత్‌ | Kidambi Srikanth is the runner up in the US Open World Tour Super 300 badminton tournament | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ శ్రీకాంత్‌

Jun 30 2026 3:36 AM | Updated on Jun 30 2026 3:36 AM

Kidambi Srikanth is the runner up in the US Open World Tour Super 300 badminton tournament

కాలిఫోర్నియా: యూఎస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ రన్నరప్‌గా నిలిచాడు. ప్రపంచ 46వ ర్యాంకర్‌ సు లి యాంగ్‌ (చైనీస్‌ తైపీ)తో జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ 38వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 15–21, 21–16, 9–21తో ఓడిపోయాడు. శ్రీకాంత్‌కు 9,500 డాలర్ల (రూ. 8 లక్షల 98 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5,950 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. శ్రీకాంత్‌ చివరిసారి 2017 అక్టోబర్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement