రన్నరప్‌ అనిరుధ్‌ జోడీ | Anirudh Jodi is the runner up in the Birmingham Open ATP Challenger 125 tournament | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ అనిరుధ్‌ జోడీ

Jun 8 2026 2:32 AM | Updated on Jun 8 2026 2:32 AM

Anirudh Jodi is the runner up in the Birmingham Open ATP Challenger 125 tournament

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది రెండో ఏటీపీ చాలెంజర్‌ టైటిల్‌ సాధించాలని ఆశించిన హైదరాబాద్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ అనిరుధ్‌ చంద్రశేఖర్‌కు నిరాశ ఎదురైంది. ఇంగ్లండ్‌లో ఆదివారం ముగిసిన బర్మింగ్‌హామ్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–125 టోర్నీలో అనిరుధ్‌ (భారత్‌)–టకెరు యుజుకి (జపాన్‌) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. బెన్‌ జోన్స్‌–జోషువా పారిస్‌ (బ్రిటన్‌) జంటతో జరిగిన ఫైనల్లో అనిరు«ద్‌–టకెరు జోడీ 4–6, 6–7 (4/7)తో పోరాడి ఓడిపోయింది. 85 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరుధ్‌–టకెరు ఏడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. 

తొలి సర్వీస్‌లో 37 పాయింట్లు, రెండో సర్వీస్‌లో ఆరు పాయింట్లు సాధించారు. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్‌ చేశారు. అంతకుముందు తొలి రౌండ్‌లో అనిరు«ద్‌–టకెరు 4–6, 7–6 (7/5), 10–1తో ఫిన్‌ బాస్‌–స్కాట్‌ డంకన్‌ (బ్రిటన్‌)లపై, క్వార్టర్‌ ఫైనల్లో 7–6 (7/3), 6–3తో ఫిన్‌ రేనాల్డ్స్‌–జేమ్స్‌ వాట్‌ (న్యూజిలాండ్‌)లపై, సెమీఫైనల్లో 7–5, 7–6 (7/5)లతో డీగో హిడాల్గో (ఈక్వెడార్‌)–ప్యాట్రిక్‌ ట్రహక్‌ (అమెరికా)లపై గెలుపొందారు. 

రన్నరప్‌ అనిరుద్‌–టకెరులకు 5,220 (రూ. 4 లక్షల 95 వేలు) డాలర్ల ప్రైజ్‌మనీతోపాటు 75 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది అనిరు«ద్‌–టకెరు ద్వయం బుసాన్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–125 టోర్నీలో డబుల్స్‌ టైటిల్‌ గెలిచింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement