సాక్షి, హైదరాబాద్: మెనూరెస్ అంతర్జాతీయ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ రన్నరప్‌గా నిలిచి రజత పతకం సాధించాడు. ఫ్రాన్స్‌లో జరిగిన ఈ టోర్నీలో రాజా రిత్విక్ నిర్నీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఏడు పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని సంపాదించాడు. ఈ టోర్నీలో రిత్విక్ ఐదు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు.
చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో టాప్ సీడ్, ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ మాక్సిమి లగార్డెను రిత్విక్ ఓడించాడు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ రోహిత్ కృష్ణ (తమిళనాడు) ఈ టోర్నీలో విజేతగా నిలిచాడు. రోహిత్ కృష్ణ, రిత్విక్ ఏడు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానం దక్కించుకున్నా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా రోహిత్ కృష్ణకు టైటిల్ ఖరారైంది.


