బిష్‌కెక్ (కిర్గిస్తాన్): ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్లు లలిత్ (55 కేజీలు) రజత పతకం... సునీల్ (87 కేజీలు) కాంస్య పతకం నెగ్గారు. ఫైనల్లో లలిత్ 0–9తో బొటిరోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. కాంస్య పతక బౌట్‌లో సునీల్ 5–4తో రసులోవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలిచాడు. 77 కేజీల కాంస్య పతక బౌట్‌లో భారత రెజ్లర్ అమన్ 14–15తో యోంగన్ (కొరియా) చేతిలో ఓడిపోయాడు.


