కాంస్యాలు గెలిచిన హన్సిక, నేహా | Hansika and Neha win bronze medals | Sakshi
Sakshi News home page

కాంస్యాలు గెలిచిన హన్సిక, నేహా

Apr 10 2026 4:00 AM | Updated on Apr 10 2026 4:00 AM

Hansika and Neha win bronze medals

బిష్‌కెక్‌ (కిర్గిస్తాన్‌): ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో గురువారం భారత్‌కు రెండు కాంస్య పతకాలు లభించాయి. మరో పతకం ఖరారైంది. మహిళల ఫ్రీస్టయిల్‌ విభాగంలో హన్సిక లాంబా (55 కేజీలు), నేహా (59 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గగా... మీనాక్షి (53 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లింది. కాంస్య పతక బౌట్‌లలో హన్సిక 6–1తో అరుకె కదిర్‌బెక్‌ (కిర్గిస్తాన్‌)పై, నేహా 10–4తో బొలోర్‌తుయా (మంగోలియా)పై గెలిచారు. 

మీనాక్షి క్వార్టర్‌ ఫైనల్లో 15–4తో ఎస్‌బోసినోవా (ఉజ్బెకిస్తాన్‌)పై, సెమీఫైనల్లో 4–2తో సెయంగ్‌ పార్క్‌ (దక్షిణ కొరియా)పై నెగ్గింది. నేడు జరిగే ఫైనల్లో చైనా రెజ్లర్‌ జిన్‌ జాంగ్‌తో మీనాక్షి తలపడుతుంది. 72 కేజీల విభాగంలో హర్షిత కాంస్యం కోసం పోరాడనుంది. సెమీఫైనల్లో హర్షిత 2–7తో మహిరో యోషిటాకె (జపాన్‌) చేతిలో ఓడిపోయింది.  

 

Advertisement
 
Advertisement
Advertisement