భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, (Narendra Modi) తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) గురువారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. నరేంద్ర మోదీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇక ఈ మధ్యే తమిళనాడు రాజకీయాల్లో సంచలన విజయంతో హాట్‌టాపిక్‌గా మారారు అగ్రనటుడు విజయ్. వీళ్లిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభిస్తోంది.
ఈ సమావేశానికి సంబంధించిన విజువల్స్ బయటకు వచ్చిన వెంటనే వైరల్ అవుతున్నాయి. భారీ ఇమేజ్ కలిగిన నాయకులు కలిసి కనిపించడంతో అభిమానులు, రాజకీయ వర్గాలు ఈ ఫొటోలను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నాయి.


