ఫిఫా ప్రపంచకప్‌ విజేతగా స్పెయిన్‌ | FIFA World Cup 2026 Final: Justin Bieber, Shakira Star In Half Time Show, Disaster For Argentina | Sakshi
Sakshi News home page

ఫిఫా ప్రపంచకప్‌ విజేతగా స్పెయిన్‌

Jul 20 2026 1:58 AM | Updated on Jul 20 2026 4:04 AM

FIFA World Cup 2026 Final: Justin Bieber, Shakira Star In Half Time Show, Disaster For Argentina

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌-2026 విజేత‌గా స్పెయిన్ అవ‌త‌రించింది. న్యూజెర్సీ వేదికగా జరిగిన ఫైనల్లో అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించిన స్పెయిన్‌.. 16 ఏళ్ల తర్వాత ఫిఫా వరల్డ్‌కప్‌ టైటిల్‌ను ముద్దాడింది. ఈ తుది పోరులో జట్లు కూడా నిర్ణీత 90 నిమిషాల్లో కనీసం ఒక్క గోల్ కూడా సాధించలేకపోయాయి. నిర్ణీత సమయంలో మ్యాచ్‌ ఫలితం తేలకపోవడంతో 30 నిమిషాలు కేటాయించారు. ఈ క్రమంలో 106వ నిమిషంలో స్పెయిన్ స్టార్ ఫెర్రాన్ టోర్రెస్ మెరుపు గోల్ కొట్టి తన జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు.

ఆధిక్యంలో స్పెయిన్‌
తుది పోరులో స్పెయిన్ ఖాతా తెరిచింది. 106 నిమిషాల తర్వాత తొలి గోల్ నమోదైంది. స్పెయిన్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ ఉత్కంఠ భ‌రితంగా సాగుతోంది. నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసిన‌ప్ప‌టికి ఇరు జ‌ట్లు కూడా ఇంకా క‌నీసం ఒక్క గోల్ కూడా సాధించలేక‌పోయాయి. దీంతో విజేత ఎవరో తేల్చడానికి ఎక్స్‌ట్రా టైమ్ 30 నిమిషాలు కేటాయించారు.

ఖాతా తెరవని ఇరు జట్లు
సెకెండ్ హాఫ్‌లోనూ  75వ నిమిషం వరకు ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. స్పెయిన్ త‌మ జ‌ట్టులో రెండు మార్పులు చేసింది. డాని ఓల్మో, అలెక్స్ బేనా స్ధానాల్లో వింగర్ నికోలస్, మైకెల్ మెరినో జట్టులోకి వచ్చారు. కాగా ఈ తుది పోరులో రెండో హైడ్రేషన్ బ్రేక్ సమయం ముగిసే వరకు కూడా అర్జెంటీనా జట్టు ప్రత్యర్థి గోల్ పోస్ట్‌ లక్ష్యంగా కనీసం ఒక్క షాట్ కూడా నమోదు చేయలేకపోయింది.

హోరాహోరీగా తలపడుతున్న స్పెయిన్‌
న్యూజెర్సీ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్-2026 ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా, స్సెయిన్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. మ్యాచ్ ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి ఇరు జట్లు ఎటాకింగ్ గేమ్ ఆడిన‌ప్ప‌టికి ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయాయి. 

మ్యాచ్ ప్రారంభంలోనే స్పెయిన్ సంచలన యువ ఆటగాడు లమిన్ యమల్‌కు గోల్ కొట్టే అద్భుత అవకాశం లభించింది. అయితే అర్జెంటీనా డిఫెన్స్ స‌మ‌ర్ధ‌వంతంగా అడ్డుకోవ‌డంతో అత‌డు త‌న‌కు ల‌భించిన ఛాన్స్‌ను చేజార్చుకున్నాడు. అయితే ఈ తుది పోరులో అర్జెంటీనాకు భారీ షాక్‌ తగిలింది.

స్టార్ డిఫెండర్ లిసాండ్రో మార్టినెజ్ తీవ్రమైన గాయానికి గురై మైదానాన్ని వీడాడు. ఇక ఫస్ట్ హాఫ్ ముగిసిన అనంతరం విరామ సమయంలో గ్లోబల్ పాప్ స్టార్స్ జస్టిన్ బీబర్, షకీరా తమ సంగీత ప్రదర్శనతో స్టేడియాన్ని హోరెత్తించారు. కాగా ఈ ఫైనల్‌ మ్యాచ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హాజరయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement