స్పెయిన్‌పై కాసుల వర్షం.. రూ. 420 కోట్ల ప్రైజ్‌మనీ! | How much prize money will Spain win for winning FIFA World Cup 2026? | Sakshi
Sakshi News home page

FIFA World Cup 2026: స్పెయిన్‌పై కాసుల వర్షం.. రూ. 420 కోట్ల ప్రైజ్‌మనీ!

Jul 20 2026 5:00 AM | Updated on Jul 20 2026 7:55 AM

How much prize money will Spain win for winning FIFA World Cup 2026?

PC: FIFA

ఫిఫా ప్రపంచకప్-2026 ఛాంపియన్స్‌గా స్పెయిన్‌ అవతరించింది. న్యూజెర్సీ వేదికగా జరిగిన ఫైనల్లో అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించి రెండోసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని స్పెయిన్‌ ముద్దాడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ తుది పోరులో నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసేసరికి ఇరు జట్లు ఎలాంటి గోల్స్ చేయలేకపోయాయి. 

దీంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చేందుకు 30 నిమిషాల ఎక్స్‌ట్రా టైమ్ కేటాయించారు. ఈ క్రమంలో 106వ నిమిషంలో స్పెయిన్ స్టార్ ఆటగాడు ఫెర్రాన్ టోర్రెస్ అద్భుతమైన గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో ప్రపంచకప్ ట్రోఫీ 2010 తర్వాత తిరిగి స్పానిష్ జట్టు సొంతమైంది.

స్పెయిన్‌పై కాసుల వర్షం
ఇక విశ్వవిజేతగా నిలిచిన స్పెయిన్ జట్టుకు ట్రోఫీతో పాటు భారీ ప్రైజ్ మనీ దక్కింది. రోడ్రి సారథ్యంలోని స్పెయిన్‌కు దాదాపు  50 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.420 కోట్లు ) నగదు బహుమతి లభించింది. అదేవిధంగా రన్నరప్ అర్జెంటీనాకు 33 మిలియన్ డాలర్లు (సుమారు రూ.రూ.277 కోట్లు) అందింది.  మూడో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు ప్రైజ్‌మనీగా 29 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 243 కోట్లు) సొంతం చేసుకుంది. అదేవిధంగా నాలుగో స్థానంలో నిలిచిన ఫ్రాన్స్  జట్టుకు 27 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 225 కోట్లు) ప్రైజ్‌మనీ దక్కింది. 

ఫిఫా ప్రపంచ కప్ 2026లో అవార్డు విజేతలు వీరే

గోల్డెన్ బూట్ - కైలియన్ ఎంబాపే (ఫ్రాన్స్)

గోల్డెన్ బాల్ - రోడ్రి (స్పెయిన్)

గోల్డెన్ గ్లోవ్ - ఉనై సైమన్ (స్పెయిన్)

బెస్ట్ యంగ్ ప్లేయర్‌ - పావ్ కుబార్సి (స్పెయిన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement