ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ | Kidambi Srikanth advances to pre quarterfinals of US Open badminton tournament | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్‌

Jun 26 2026 3:07 AM | Updated on Jun 26 2026 3:07 AM

Kidambi Srikanth advances to pre quarterfinals of US Open badminton tournament

కాలిఫోర్నియా: యూఎస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత సీనియర్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. తొలి రౌండ్‌లో శ్రీకాంత్‌ 21–14, 21–12తో భారత్‌కే చెందిన సనీత్‌ దయానంద్‌పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో రౌనక్‌ చౌహాన్‌ (భారత్‌) 23–21, 21–16తో శంకర్‌ ముత్తుస్వామి (భారత్‌)పై గెలుపొంది ముందంజ వేశాడు. 

మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్‌ తన్వీ శర్మ, ఆరో సీడ్‌ దేవిక సిహాగ్‌ కూడా శుభారంభం చేశారు. తన్వీ 23–21, 21–16తో వొన్నె లీ (జర్మనీ)పై... దేవిక 21–14, 21–14తో లూసియా కాస్టిల్లో (పెరూ)పై విజయాలు సాధించారు. మరో మ్యాచ్‌లో రక్షిత శ్రీ 21–15, 21–8తో టెరెజా స్వాబికోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలిచి ముందంజ వేసింది. హైదరాబాద్‌ అమ్మాయి శ్రియాంశి వలిశెట్టి, అన్‌మోల్, తాన్యా హేమంత్, ఆకర్షి కశ్యప్‌ తొలి రౌండ్‌లోనే పరాజయం పాలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement