టీమిండియా ప్లేయర్‌ వరల్డ్‌ రికార్డ్‌ | : Deepti Sharma Scripts Big World Record As India Outplay Thailand By 94 Runs | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. ప్రపంచ రికార్డ్‌ బ్రేక్‌

Aug 31 2026 10:29 AM | Updated on Aug 31 2026 11:31 AM

: Deepti Sharma Scripts Big World Record As India Outplay Thailand By 94 Runs

PC: BCCI Twitter

మ‌హిళ‌ల ఆసియాక‌ప్‌-2026లో భార‌త్ బోణీ కొట్టింది. దుబాయ్ వేదిక‌గా థాయ్‌లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 94 ప‌రుగుల తేడాతో టీమిండియా విజ‌యం సాధించింది. ఈ విజ‌యంలో స్టార్ ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ‌ది కీల‌క పాత్ర‌. బ్యాటింగ్‌లో నిరాశ‌ప‌రిచిన దీప్తీ.. బౌలింగ్‌లో మాత్రం అద‌ర‌గొట్టింది. 

కేవ‌లం 1.1 ఓవ‌ర్ మాత్ర‌మే బౌలింగ్ చేసిన దీప్తి  మూడు వికెట్లు ప‌డ‌గొట్టి స‌త్తాచాటింది. ఈ క్ర‌మంలో యూపీ క్రికెట‌ర్ ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకుంది. మ‌హిళ‌ల టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన బౌల‌ర్‌గా దీప్తి రికార్డుల‌కెక్కింది. ఆమె ఇప్ప‌టివ‌ర‌కు టీ20ల్లో 171 వికెట్లు ప‌డ‌గొట్టింది. 

ఇంత‌కుముందు ఈ రికార్డు థాయిలాండ్ బౌలర్ తిపట్చా పుత్తవోంగ్(170) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో తిపట్చాను దీప్తి అధిగ‌మించింది. అదేవిధంగా భారత మహిళల క్రికెట్ తరఫున 150 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న మూడో క్రికెటర్‌గా కూడా ఆమె నిలిచింది. అంతకుముందు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (203 మ్యాచ్‌లు), వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (172 మ్యాచ్‌లు) మాత్రమే ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నారు.

మహిళల టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే

దీప్తి శర్మ-171

తిపట్చా పుట్టావాంగ్-170

హెన్రియెట్ ఇషిమ్వే-164

సోఫీ ఎక్లెస్టోన్ -154

కారీ చాన్-153

ఒన్నిచా కమ్‌చోంఫు-153
చదవండి: పాకిస్తాన్‌ ఖేల్‌ ఖతం.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసు నుంచి అవుట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement