11వ స్ధానంలో సరికొత్త చరిత్ర.. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాని రికార్డ్‌ | Kranti Gaud Creates T20 History As India Women Begin Asia Cup 2026 With Big Win Over Thailand, Check More Details Inside | Sakshi
Sakshi News home page

11వ స్ధానంలో సరికొత్త చరిత్ర.. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాని రికార్డ్‌

Aug 31 2026 8:47 AM | Updated on Aug 31 2026 10:56 AM

Kranti Gaud Registers Highest Score By Indian No. 11 Across Mens And Womens T20Is

మ‌హిళ‌ల ఆసియా క‌ప్‌-2026 టోర్నీని భార‌త్ విజ‌యంతో ఆరంభించింది. ఆదివారం  థాయ్‌లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 94 ప‌రుగుల తేడాతో హ‌ర్మ‌న్ సేన ఘ‌న విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఉమెన్స్ టీమ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు సాధించింది. 

ఓ ద‌శ‌లో భారీ స్కోర్ చేసేలా క‌నిపించిన భార‌త్ మిడిల్ ఓవ‌ర్ల‌లో వ‌రుస వికెట్ల కోల్పోవ‌డంతో నామ‌మాత్ర‌పు స్కోర్‌కే ప‌రిమిత‌మైంది. భార‌త బ్యాట‌ర్ల‌లో షెఫాలీ వ‌ర్మ(64) టాప్ స్కోర‌ర్ నిల‌వ‌గా.. 11 వ‌స్ధానంలో బ్యాటింగ్ వ‌చ్చిన పేస‌ర్ క్రాంతి గౌడ్‌(8 బంతుల్లోనే 15 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్ ఆడింది. దీంతో క్రాంతి గౌడ్ ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకుంది. 

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో ( మెన్స్ అండ్ ఉమెన్స్‌ విభాగాలలో కలిపి) 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన మొదటి భారత బ్యాటర్‌గా క్రాంతి రికార్డులకెక్కింది. టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు ఏ భార‌త బ్యాట‌ర్ కూడా ప‌ద‌కొండో స్దానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చి డబుల్ డిజిట్ స్కోరు సాధించలేదు. గతంలో సిరాజ్‌, శ్రీ చరణి నెలకొల్పిన ఏడు పరుగుల రికార్డును క్రాంతి దాటేసింది.

కుప్ప‌కూలిన థాయ్‌
అనంత‌రం ల‌క్ష్య చేధ‌న‌లో థాయ్‌లాండ్ 65 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. నందినీ శ‌ర్మ‌, దీప్తీ శ‌ర్మ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్టి థాయ్ జ‌ట్టు ప‌త‌నాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు తెలుగు తేజం శ్రీచ‌ర‌ణి రెండు వికెట్లు సాధించింది. థాయ్‌లాండ్ బ్యాట‌ర్ల‌లో నన్నపత్ కొంచరోయెంకై(41) టాప్ స్కోర‌ర్‌గా నిలిచింది.
చదవండి: పాకిస్తాన్‌ ఖేల్‌ ఖతం.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసు నుంచి అవుట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement