పాకిస్తాన్‌ ఖేల్‌ ఖతం.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసు నుంచి అవుట్‌! | WTC Points Table After England Vs Pakistan 2nd Test, Pakistan Slip Further And England Rise, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ ఖేల్‌ ఖతం.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసు నుంచి అవుట్‌!

Aug 31 2026 7:45 AM | Updated on Aug 31 2026 10:02 AM

WTC Table After England vs Pakistan 2nd Test

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై పాకిస్తాన్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతోంది. లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టులో 194 ప‌రుగుల భారీ తేడాతో పాక్ ఘోర ఓట‌మి చ‌విచూసింది. దీంతో పర్యాట‌క జట్టు మూడు టెస్టుల సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలూండ‌గానే 2-0 తేడాతో ఇంగ్లండ్‌కు స‌మ‌ర్పించుకుంది. లార్డ్స్ టెస్టులో బౌలింగ్ ప‌రంగా పాకిస్తాన్ ప‌ర్వాలేన్పించిన‌ప్ప‌టికి బ్యాటింగ్‌లో మాత్రం దారుణంగా విఫ‌ల‌మైంది. 

ఇంగ్లండ్‌ నిర్దేశించిన 389 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ జ‌ట్టు త‌మ రెండో ఇన్నింగ్స్‌లో  50.5 ఓవర్లలో కేవ‌లం 194 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లీష్ పేస‌ర్ ఓలీ రాబిన్స‌న్ 4 వికెట్లు ప‌డ‌గొట్టి పాక్ ప‌త‌నాన్ని శాసించాడు. అత‌డితో పాటు జోష్ టంగ్ మూడు, ఆర్చ‌ర్ రెండు వికెట్లు సాధించారు. అంత‌కుముందు పాక్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 110 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

పాక్ ఖేల్ ఖతం
కాగా ఈ ఓటమితో పాకిస్తాన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు దాదాపు నిష్క్రమించినట్లే. ఈ సైకిల్‌లో ఇప్పటివరకు 8 టెస్టులు ఆడిన పాకిస్తాన్‌.. కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది. 16.67 విజయాల శాతంతో పాక్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానానికి పడిపోయింది. 

ప్రస్తుత సైకిల్‌లో పాక్ ఇంకా 5 టెస్టులు ఆడనుంది. ఇక ఇంగ్లండ్‌ ఈ విజయంతో ఆరువ స్ధానానికి చేరు​కుంది. రూట్ సేన విజయాల శాతం 33.44గా ఉంది. ఇంగ్లీష్ జట్టు ఫైనల్‌కు చేరాలంటే మిగిలిన మ్యాచ్‌లన్నింటిలోనూ గెలవాల్సిందే. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తర్వాత స్దానాల్లో ఉన్నాయి. భారత్ ఐదో స్ధానంలో ఉంది. టీమిండియా ఇంకా 7 మ్యాచ్‌లు ఆడనుంది. అందులో ఐదు గెలిచినా గిల్‌ సేన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తోంది.
చదవండి: థాయ్‌లాండ్‌తో మ్యాచ్‌.. స్మృతి మంధన ప్రపంచ రికార్డు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement