ఇంగ్లండ్‌దే సిరీస్‌ | England beat Pakistan by 194 runs in second Test | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌దే సిరీస్‌

Aug 31 2026 3:52 AM | Updated on Aug 31 2026 3:52 AM

England beat Pakistan by 194 runs in second Test

లండన్‌: పాకిస్తాన్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్‌ జట్టు మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. ఆదివారం లార్డ్స్‌ మైదానంలో ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ 194 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 389 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 50.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. 

సౌద్‌ షకీల్‌ (97; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగతా పాక్‌ బ్యాటర్లు విఫలమయ్యారు. ఇంగ్లండ్‌ పేస్‌ బౌలర్లు రాబిన్సన్‌ (4/28), జోష్‌ టంగ్‌ (3/46), ఆర్చర్‌ (2/73) పాక్‌ను దెబ్బ తీశారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 177/7తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకు ఆలౌటైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement