ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్‌జోన్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి విధించిన ఫాలో-ఆన్ మార్కును సౌత్‌జోన్ అందుకోలేకపోయింది. ఫాలో-ఆన్‌కు 173 పరుగుల దూరంలోనే నిలిచిపోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌జోన్ జట్టుకు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
పాపం తిలక్ వర్మ
ఈ తుది పోరులో సౌత్‌జోన్ కెప్టెన్ తిలక్ వర్మ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవైపు సహచర బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నా.. తిలక్ మాత్రం బాధ్యతాయుతమైన నాక్‌తో జట్టును ముందుకు నడిపించాడు. అయితే దురదృష్టవశాత్తూ తిలక్ తన 9వ ఫస్ట్‌క్లాస్ సెంచరీకి అడుగు దూరంలో నిలిచిపోయాడు. ఈ హైదరాబాదీ 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కౌనైన్ ఖురైషీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
అతడితో పాటు దేవ్‌దత్త్ పడిక్కల్(62), సీవీ మిలింద్(43), జగదీశన్(32) రాణించారు. ఈస్ట్‌జోన్ బౌలర్లలో ముఖేష్ కుమార్ మూడు, ఖురేషీ, మహ్మద్ షమీ, శిఖర్ మోహన్ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఈస్ట్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్(270) భారీ డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నిబంధనల ప్రకారం.. మ్యాచ్ డ్రా అయితే ఏ జట్టుకు అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం లభిస్తుందో ఆ టీమ్‌నే విజేతగా నిర్ణయిస్తారు.
చదవండి: వెస్టిండీస్‌తో సిరీస్.. టీమిండియాలోకి ఆర్సీబీ కెప్టెన్?


