బీసీసీఐ బిగ్ ప్లాన్.. ఇంగ్లండ్‌కు ‘కాశ్మీర్ ఎక్స్‌ప్రెస్’ ఆకిబ్ నబీ! | Aqib Nabi Set To Make County Debut With Surrey Ahead Of India’s New Zealand Tour, Read Story Inside | Sakshi
Sakshi News home page

బీసీసీఐ బిగ్ ప్లాన్.. ఇంగ్లండ్‌కు ‘కాశ్మీర్ ఎక్స్‌ప్రెస్’ ఆకిబ్ నబీ!

Aug 30 2026 3:23 PM | Updated on Aug 30 2026 5:22 PM

Auqib Nabi Picked By English Team Amid India Test Snub

జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ తొలిసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న కాంటీ ఛాంపియన్‌షిప్‌లో సర్రే క్రికెట్ క్లబ్‌కు నబీ ప్రాతినిధ్యం వహించనున్నాడు. బీసీసీఐ ప్రత్యేక చొరవతో సర్రే కౌంటీ క్లబ్ ఆకిబ్‌తో ఈ స్వల్పకాలిక ఒప్పందం కుదుర్చుకుంది.

సర్రే తరఫున ఆకిబ్ నబీ మొత్తం మూడు కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లు ఆడనున్నాడు. సెప్టెంబర్‌ 2 నుంచి యార్క్‌షైర్‌తో జరిగే మ్యాచ్ ద్వారా ఆయన కౌంటీల్లో అడుగుపెట్టనున్నాడు. ఇటీవల శ్రీలంక సిరీస్‌కు ఆకిబ్ ఎంపికైనప్పటికీ, అక్కడి పరిస్థితుల కారణంగా తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు.

బీసీసీఐ మాస్టర్‌ ప్లాన్‌
కాగా భారత జట్టు రాబోయే న్యూజిలాండ్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఆకిబ్‌ను కౌంటీలకు పంపాలని నిర్ణయించింది. న్యూజిలాండ్ పిచ్‌లు బౌన్స్, పేస్‌కు అనుకూలంగా ఉంటాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ అక్కడి కండీషన్స్‌ తగ్గట్టు సిద్దం చేసేందుకు నబీని ఇంగ్లండ్‌ కౌంటీల్లో ఆడిస్తోంది. ఇంగ్లండ్‌ గడ్డపై డ్యూక్‌ బాల్‌తో సాధన నబీకి ఎంతగానో ఉపయోగపడనుంది.

అకిబ్ నబీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత కొంత కాలంగా రెడ్ బాల్ క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో 12.57 సగటుతో 60 వికెట్లు పడగొట్టాడు. జమ్మూ అండ్ కాశ్మీర్ తొలి రంజీ టైటిల్‌ను సొంతం చేసుకోవడంలో నబీది కీలక పాత్ర. అయినప్పటికి అతడికి ఇంకా టీమిండియా తరపున అరంగేట్రం చేసే అవకాశం లభించలేదు.
చదవండి: అతడి బౌలింగ్‌లో పసలేదు.. ఇలా అయితే కష్టమే: గవాస్క‌ర్

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement