శ్రీలంకకు అతి భారీ షాకిచ్చిన ఐసీసీ | Sri Lanka Loses 2027 Women Champions Trophy Hosting Rights, Participation Also In Doubt, Check Out More Details | Sakshi
Sakshi News home page

శ్రీలంకకు అతి భారీ షాకిచ్చిన ఐసీసీ

Aug 30 2026 1:43 PM | Updated on Aug 30 2026 4:13 PM

ICC Moves Champions Trophy 2027 Out Of Sri Lanka

source: X

శ్రీలంక క్రికెట్‌కు ఐసీసీ అతి భారీ షాకిచ్చింది. 2027 మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను ఆ దేశం నుంచి తొలగించింది. టోర్నీని మరో దేశానికి తరలించాలని ఐసీసీ నిర్ణయించినట్లు శ్రీలంక క్రికెట్ ట్రాన్స్‌ఫర్మేషన్ కమిటీ కార్యదర్శి ప్రకాశ్ షాఫ్టర్ వెల్లడించారు.

ఈ టోర్నీని 2027 ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు నిర్వహించాల్సి ఉండింది. ఇది తొలిసారిగా జరగనున్న మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి.

శ్రీలంకపై చర్యలు ఎందుకు..?
శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, బోర్డు పాలనలో సంస్కరణలు, ఎన్నికలు నిర్వహించడంలో ఆలస్యం వంటి అంశాలపై అసంతృప్తిగా ఉన్న ఐసీసీ, టోర్నీ ఆతిథ్య హక్కులను తొలగించింది. ఐసీసీ ఇటీవలే శ్రీలంక క్రికెట్ ప్రతినిధులను ఐసీసీ బోర్డు సమావేశానికి హాజరుకాకుండా ఆంక్షలు కూడా విధించింది.

ఇదే తరహాలో 2024 అండర్-19 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను కూడా శ్రీలంక కోల్పోయింది. ఆ టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలించారు.

ఆడటం కూడా అనుమానమే..!
ఆతిథ్య దేశ హోదాలో శ్రీలంకకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ లభించింది. ఇప్పుడు ఆతిథ్య హక్కులు కోల్పోవడంతో ఆ దేశ జట్టు టోర్నీలో పాల్గొనడం కూడా ప్రశ్నార్థకంగా మారింది.

ప్రస్తుతం శ్రీలంక మహిళల జట్టు ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో 7వ స్థానంలో ఉంది. టోర్నీలో టాప్-5 ర్యాంక్ జట్లతో పాటు ఆతిథ్య దేశం పాల్గొనే విధానం ఉంటే, శ్రీలంక ర్యాంకింగ్ ఆధారంగా అర్హత సాధించకపోవచ్చు. 

ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా టోర్నీకి అర్హత సాధించాయి. ఒకవేళ కొత్త ఆతిథ్య దేశం ఈ ఐదు జట్లలో ఒకటైతే,  శ్రీలంక స్థానంలో ఆరో జట్టుగా వెస్టిండీస్‌కు అవకాశం దక్కవచ్చు. అదే టోర్నీకి ఆతిథ్యం వహించే దేశం టాప్-5లో లేని జట్టు అయితే, ఆ దేశానికి ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ లభిస్తుంది. 

చదవండి: 15 ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement