స్టార్‌ క్రికెటర్‌కు షాకిచ్చిన ఐసీసీ.. 15 నెలల నిషేధం | Asif Khan banned for testing positive for prohibited substance | Sakshi
Sakshi News home page

స్టార్‌ క్రికెటర్‌కు షాకిచ్చిన ఐసీసీ.. 15 నెలల నిషేధం

Aug 27 2026 2:58 PM | Updated on Aug 27 2026 3:59 PM

Asif Khan banned for testing positive for prohibited substance

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) బ్యాటర్ ఆసిఫ్ ఖాన్‌కు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భారీ షాక్ ఇచ్చింది. డోపింగ్ పరీక్షలో విఫలమైనందుకు అత‌డిపై 15 నెల‌ల నిషేధాన్ని ఐసీసీ విధించింది. 2025 సెప్టెంబర్ 8న ఆసిఫ్ డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షల్లో అతడు నిషేధిత పదార్దం అయిన మ్యాస్టెరోలోన్ మెటాబోలైట్ తీసుకున్న‌ట్లు తేలింది. 

దీనిపై స్పందించిన ఆసిఫ్‌, తాను తప్పు చేసినట్లు అంగీకరించాడు. అయితే ఈ పదార్థాన్ని తాను మ్యాచ్‌లు లేని సమయంలో (అవుట్-ఆఫ్-కాంపెటీషన్) తీసుకున్నానని అత‌డు చెప్పుకొచ్చాడు. అయిన‌ప్ప‌టికి నిబంధ‌న‌లు ప్ర‌కారం క్రీడాకారులు నిషేధిత డ్ర‌గ్స్ తీసుకోవ‌డం నేరం కావ‌డంతో ఐసీసీ ఈ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంది. 

అత‌డిపై నిషేధం 2025 సెప్టెంబర్ 8 నుంచి అమలులోకి వచ్చినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది డిసెంబ‌ర్ 7 త‌ర్వాత ఆసిఫ్‌పై బ్యాన్‌ను ఎత్తివేస్తారు. అయితే ఈ నిషేధిత స‌మ‌యంలో అత‌డు సాధించిన వ్యక్తిగత రికార్డులు, ప్రైజ్‌మ‌నీని ర‌ద్దు చేస్తారు. 

కాగా పాకిస్తాన్‌లో జ‌న్మించిన ఆసిఫ్ ఖాన్‌.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో మాత్రం యూఏఈకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. అత‌డు ఇప్ప‌టివ‌ర‌కు యూఏఈ త‌ర‌పున 38 వ‌న్డేలు, 56 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 2572 ప‌రుగులు చేశాడు. అత‌డు చివ‌ర‌గా 2025లో యూఏఈ త‌ర‌పున ఆడాడు.
చదవండి: IND vs AUS: భారత జట్టు ప్రకటన.. సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులకు చోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement