అరుదైన రికార్డు.. భారత క్రికెట్‌ చరిత్రలోనే | Deeban Lingesh Creates History With Golden Hat-Trick | Sakshi
Sakshi News home page

అరుదైన రికార్డు.. భారత క్రికెట్‌ చరిత్రలోనే

Aug 27 2026 3:58 PM | Updated on Aug 27 2026 4:28 PM

Deeban Lingesh Creates History With Golden Hat-Trick

PC: X

తమిళనాడు ప్రీమియర్‌ లీగ్-2026 సీజన్‌ తుది అంకానికి చేరుకుంది. బుధవారం చెన్నై వేదికగా జరిగిన క్వాలిఫయర్‌-2లో ట్రిచీ గ్రాండ్ చోలాస్‌ను 84 పరుగుల తేడాతో చిత్తు చేసిన విడా కోవై కింగ్స్‌. తమ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో అద్భుతం చోటు చేసుకుంది. 

కోవై కింగ్స్‌ పేసర్‌ దీబన్‌ లింగేష్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో మొదటి మూడు బంతుల్లో వరుసగా మూడు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన కోవై కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. 

అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రిచీకి ఆరంభంలోనే లింగేష్‌ షాకిచ్చాడు. మొదటి మూడు బంతుల్లోనే కె. రాజ్‌కుమార్‌, ఎస్‌. శ్యామ్‌ సుందర్‌, జగన్నాథన్‌ కౌశిక్‌లను లింగేష్‌ ఔట్‌ చేశాడు. దీంతో గోల్డెన్‌ హ్యాట్రిక్‌ సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో మరో సంచలనం నమోదైంది. ట్రిచి ఇన్నింగ్స్‌లో జాఫర్‌ జమాల్‌, డేవిడ్‌సన్‌ కూడా గోల్డెన్‌ డకౌటయ్యారు. భారత టీ20 చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఐదుగురు బ్యాటర్లు గోల్డెన్ డక్‌ కావడం ఇదే తొలిసారి. లింగేష్‌తో పాటు మణిమారన్ సిద్ధార్థ్ కూడా నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. ఫలితంగా ట్రిచీ జట్టు 15.4 ఓవర్లలో కేవలం 99 పరుగులకే ఆలౌటైంది.



 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement