Photo Credit : X
ఆస్ట్రేలియా యువ జట్టుతో స్వదేశంలో జరిగే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ అండర్-19 జట్టును ప్రకటించిది. ఈ జట్టులో టీమిండియా దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, వీరేందర్ సెహ్వాగ్ కుమారులకు చోటు దక్కింది.
ఆసీస్‌తో ఆడే వన్డే జట్టుకు ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్ ఎంపికయ్యారు. కాగా భారత్ ఆసీస్‌తో లక్ష్య రాయ్‌చందాని, యశ్‌వర్దన్ చౌహాన్ సారథ్యంలో మూడు వన్డే, రెండు మల్టీ డే మ్యాచ్‌లలో తలపడనుంది.
ఆర్యవీర్‌కు తొలిసారి పిలుపు
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్.. భారత అండర్-19 జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. కూచ్ బెహర్ ట్రోఫీ-2024 సీజన్‌లో ఢిల్లీ అండర్-19 తరఫున మేఘాలయతో మ్యాచ్‌లో 18 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 309 బంతుల్లోనే ఏకంగా 297 పరుగులు సాధించాడు.
తృటిలో ట్రిపుల్ సెంచరీ చేజారినప్పటికీ ఈ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఆర్యవీర్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. ఇక ఇటీవల ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2026లో ఆర్యవీర్ చివరిగా వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరఫున కాంపిటేటివ్ మ్యాచ్ ఆడాడు.
స్థానం నిలబెట్టుకున్న అన్వయ్
టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ఇప్పటికే భారత్ అండర్-19 జట్టు తరఫున ఆడాడు. 16 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ గత నెలలో శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు యూత్ వన్డేలు ఆడి రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 101 పరుగులు సాధించాడు.
భారత్ వర్సెస్ ఆసీస్ అండర్-19 జట్ల షెడ్యూల్
యూత్ వన్డేలు
👉తొలి వన్డే- సెప్టెంబరు 18- రాజ్‌కోట్
👉రెండో వన్డే- సెప్టెంబరు 21- రాజ్‌కోట్
👉మూడో వన్డే- సెప్టెంబరు 23- రాజ్‌కోట్
మల్టీ డే మ్యాచ్‌లు
👉తొలి మ్యాచ్- సెప్టెంబరు 27-30: రాజ్‌కోట్
👉రెండో మ్యాచ్- అక్టోబరు 5-8: అ హ్మదాబాద్- బి గ్రౌండ్.
ఆస్ట్రేలియా యువ జట్టుతో వన్డే మ్యాచ్‌లకు భారత జట్టు
లక్ష్య రాయ్‌చందాని (కెప్టెన్), యశ్‌వర్దన్ చౌహాన్ (వైస్ కెప్టెన్), రజత్ భగేల్ (వికెట్ కీపర్), ఆర్యవీర్ సెహ్వాగ్, వీకే వినీత్, కుశాగ్ర ఓజా, అర్జున్ రాజ్‌పుత్, మనాల్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), వి.యశ్‌వీర్, రోహిత్ యాదవ్, శవిన్ వినోద్, మోహిత్ ఉల్వా, చిగురుపాటి వెంకట, కావ్యా పటేల్.
ఆస్ట్రేలియా యువ జట్టుతో మల్డీ-డే మ్యాచ్‌లకు భారత జట్టు
యశ్‌వర్దన్ చౌహాన్ (కెప్టెన్), లక్ష్య రాయ్ చందాని (వైస్ కెప్టెన్), సాగర్ విర్క్, కుశాగ్ర ఓజా, మనాల్ చౌహాన్, కుష్ పటేల్, మానవ్ క్రిష్ణ (వికెట్ కీపర్), అభిప్రయ్ బిస్వాస్ (వికెట్ కీపర్), రోహిత్ యాదవ్, ఇషాన్ ఓమ్, అయాన్ అక్రం, ప్రణవ్ రాఘవేంద్ర, ప్రియాన్షు సింగ్, మోహిత్ ఉల్వా, ఆర్యన్ యాదవ్.


