అతడి బౌలింగ్‌లో పసలేదు.. ఇలా అయితే కష్టమే: గవాస్క‌ర్ | Sunil Gavaskars blunt remark on newcomers performance in SL vs IND 2026 2nd Test | Sakshi
Sakshi News home page

అతడి బౌలింగ్‌లో పసలేదు.. ఇలా అయితే కష్టమే: గవాస్క‌ర్

Aug 30 2026 1:55 PM | Updated on Aug 30 2026 2:04 PM

Sunil Gavaskars blunt remark on newcomers performance in SL vs IND 2026 2nd Test

కొలంబో వేదిక‌గా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో భార‌త అరంగేట్ర స్పిన్న‌ర్ సారాంశ్ జైన్ ఆశించిన స్దాయిలో రాణించ‌లేక‌పోయాడు. కుల్దీప్ యాద‌వ్ స్ధానంలో జ‌ట్టులోకి వ‌చ్చిన ఈ ఆఫ్ స్పిన్న‌ర్ త‌న పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో నిరాశ‌ప‌రిచాడు. ఈ నేప‌థ్యంలో భార‌త మాజీ క్రికెట‌ర్ సునీల్ గవాస్క‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

"తొలి మ్యాచ్ ఆడుతున్న ఆందోళన, ఒత్తిడి సారాంశ్‌లో స్పష్టంగా కనిపించాయి. శ్రమించి బౌలింగ్  ప్రయత్నించినప్పటికీ, అతడు ప్రభావం చూపలేకపోయాడు. అంతర్జాతీయ స్థాయి బ్యాటర్లను ఇబ్బంది పెట్టేంత వైవిధ్యం అతడి బౌలింగ్‌లో లేదు.

బ్యాటర్లను బోల్తా కొట్టించే డ్రిఫ్ట్ లేదా ఫ్లైట్ డెలివరీలను అతడు వేయలేకపోయాడు. పూర్తిగా పిచ్ నుంచి లభించే సహకారంపైనే ఆధారపడటంతో లంక బ్యాటర్లు అతడి బౌలింగ్‌ను సులువుగా ఎదుర్కొన్నారు" అని గవాస్కర్ ‘మిడ్-డే’లోని తన కాలమ్‌లో రాసుకొచ్చారు.

కాగా ఐదు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్ చివరకు డ్రాగా ముగిసింది. ఐదో రోజు ఆటలో శ్రీలంకను ఆలౌట్ చేయలేక భారత బౌలర్లు చేతులెత్తేశారు. లంక యువ ఆటగాడు సోనాల్ దినుష విరోచిత పోరాటంతో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. టెయిలాండర్లతో కలసి మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు.
చదవండి: గంభీర్‌ సంచలన నిర్ణయం.. డేంజర్‌లో శ్రేయస్ అయ్యర్ ప్లేస్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement