క్రికెట్‌ చరిత్రలో వింత ఘటన.. ఆసీస్‌ బ్యాటర్‌కు చేదు అనుభవం! | Jake Weatherald Hilariously Smashes-Moonball-Umpire Denies Boundary | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ చరిత్రలో వింత ఘటన.. ఆసీస్‌ బ్యాటర్‌కు చేదు అనుభవం!

Sep 23 2026 11:45 AM | Updated on Sep 23 2026 11:57 AM

Jake Weatherald Hilariously Smashes-Moonball-Umpire Denies Boundary

Photo Credit: Twitter

ఆస్ట్రేలియా వేదికగా జ‌రుగుతున్న‌ వ‌న్డే క‌ప్‌లో భాగంగా సౌత్ ఆస్ట్రేలియా, త‌స్మానియా మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. సౌత్ ఆస్ట్రేలియా బ్యాట‌ర్ జేక్ వెద‌రాల్డ్ క‌ష్ట‌ప‌డి బౌండ‌రీ కొట్టిన‌ప్ప‌టికీ అంపైర్ ఫోర్ ఇచ్చేందుకు నిరాక‌రించాడు. ఇన్నింగ్స్ 15వ ఓవ‌ర్లో ఇది చోటుచేసుకుంది. ఓవ‌ర్‌లో ఐదో బంతిని వేసేందుకు త‌స్మానియా బౌల‌ర్ రాఫ్ మెక్‌మిల‌న్ సిద్ధ‌మ‌య్యాడు. 

అయితే బంతి అనూహ్యంగా అత‌డి చేతిలో నుంచి స్లిప్ అయి లెగ్‌సైడ్ దిశ‌లో పిచ్  అవ‌త‌ల ప‌డింది. బంతిని అంపైర్‌ అప్ప‌టికే నోబాల్ క‌మ్‌ డెడ్‌బాల్‌గా ప‌రిగ‌ణించాడు. అయితే జాక్ వెద‌రాల్డ్ మాత్రం స‌ర‌దాగా బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా బౌండ‌రీ త‌ర‌లించాడు. వెద‌రాల్డ్ కొట్టిన ఫోర్‌ను కౌంట్ చేయ‌ని అంపైర్ అత‌డికి అనుకూలంగా ఫ్రీ హిట్ మాత్రం ఇచ్చాడు. 

రాఫ్ మెక్‌మిలన్ వేసిన ఫ్రీ హిట్‌ను వెద‌రాల్డ్ లాంగాన్ మీదుగా భారీ సిక్స‌ర్ త‌ర‌లించాడు. మ‌రి అంపైర్ దానిని నోబాల్ క‌మ్ డెడ్‌బాల్‌గా ఎందుకు ప‌రిగ‌ణించార‌నేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎంసీసీ చట్టం ప్ర‌కారం బంతి పిచ్ అవ‌త‌ల బౌన్స్ కావ‌డంతో నోబాల్ ఇవ్వ‌డం జ‌రిగింది. అస‌లు పిచ్‌పై బంతి ప‌డ‌క‌పోవ‌డంతో డెడ్‌బాల్‌గా కూడా ప‌రిగ‌ణించారు. ఇక ఎంసీసీలోని 21 చ‌ట్టం ప్ర‌కారం నోబాల్ వేస్తే ఫ్రీహిట్ ఇవ్వాల్సి ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే.

మ్యాచ్ విష‌యానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. మాథ్యూ గైక్స్ (97 నాటౌట్‌), జేక్ వెద‌రాల్డ్ (92), జేక్ ఫ్రేజ‌ర్ మెక్‌గుర్క్ (88) భారీ అర్థ‌సెంచ‌రీల‌తో రాణించ‌డంతో  50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 383 ప‌రుగులు చేసింది. త‌స్మానియా బౌల‌ర్ల‌లో మాథ్యూ కున్‌మెన్, మిచెల్ ఓవ‌న్ చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు.  భారీ ల‌క్ష్య ఛేద‌నతో బ‌రిలోకి దిగిన త‌స్మానియా జ‌ట్టు 19 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 3 వికెట్ల న‌ష్టానికి 156 ప‌రుగులు చేసింది. టిమ్ వార్డ్ (52), జోర్డాన్ సిల్క్ (48) క్రీజులో ఉన్నారు.

ఇదీ చదవండి: విండీస్‌తో తొలి వ‌న్డే.. జట్టుతో కలవనున్న రో-కో ద్వయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement