మత్స్యకారుల సాహసం.. చివరకు తల్లి ఒడికి! | Fishermen Rescue Newborn Elephant Calf from Teesta River Viral | Sakshi
Sakshi News home page

మత్స్యకారుల సాహసం.. చివరకు తల్లి ఒడికి!

Sep 23 2026 8:50 AM | Updated on Sep 23 2026 9:00 AM

Fishermen Rescue Newborn Elephant Calf from Teesta River Viral

నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న రోజుల వయసున్న ఏనుగు పిల్లను మత్స్యకారులు ప్రాణాలకు తెగించి కాపాడారు. దాదాపు నాలుగు కిలోమీటర్లు పడవల్లో వెంబడించి.. అలసిపోయిన ఆ చిన్నారిని ఒడ్డుకు చేర్చారు. అటవీశాఖ సిబ్బంది సంరక్షణ అనంతరం రెండు గంటల పాటు గాలించి చివరకు దాని తల్లిని గుర్తించారు. నీటిలోకి వచ్చి తన బిడ్డను చేరదీసిన తల్లి ఏనుగు దృశ్యం అక్కడున్న వారిని కదిలించింది.

పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లా గజోల్డోబా సమీపంలో సెప్టెంబర్‌ 21న ఈ ఘటన జరిగింది. టీస్తా నదిలో మూడు, నాలుగు రోజుల వయసున్న ఏనుగు పిల్ల ప్రవాహంలో కొట్టుకుపోతుండటాన్ని నార్త్‌ బెంగాల్‌ ఫిషర్‌మెన్‌ ఫోరం సభ్యులు గుర్తించారు. వెంటనే మిథు దాస్‌, బిశ్వనాథ్‌ దాస్‌, రాజేశ్‌ దాస్‌, గోపాల్‌ దాస్‌, బబ్లు దాస్‌ పడవల్లో దాన్ని వెంబడించారు.

నాలుగు కిలోమీటర్లు వెంబడించి..
తీవ్ర ప్రవాహం కారణంగా ఏనుగు పిల్లను దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర నదిలో కొట్టుకుపోతూ వెళ్లింది. మత్స్యకారులు పడవలను దాని వెంట నడిపి.. ఎట్టకేలకు దాన్ని జాగ్రత్తగా పైకి ఎత్తుకుని పడవలోకి చేర్చారు. ఒడ్డుకు తీసుకొచ్చే వరకు చిన్నారిని ఓదారుస్తూ, జాగ్రత్తగా సంరక్షించారు.

రెండు గంటల తర్వాత తల్లి చెంతకు..
సమాచారం అందుకున్న బైకుంఠపూర్‌ అటవీశాఖ అధికారులు ఏనుగు పిల్లకు అవసరమైన సంరక్షణ అందించారు. అనంతరం తల్లి ఏనుగు కోసం గాలింపు చేపట్టారు. దాదాపు రెండు గంటల తర్వాత గుంపును గుర్తించి.. పిల్లను తల్లి దగ్గరకు చేర్చారు. తన బిడ్డను చూసిన తల్లి ఏనుగు నీటిలోకి వచ్చి దానికి పాలు ఇచ్చింది.

ప్రస్తుతం ఏనుగు పిల్ల, తల్లి రెండింటినీ అటవీశాఖ అధికారులు గుంపుతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. సకాలంలో స్పందించి ఏనుగు పిల్ల ప్రాణాలను కాపాడిన మత్స్యకారులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement