సర్కారు హాస్టల్స్‌లో గొడ్డు మాంసం?! | Beef in Tamil Nadu Government Hostels Students Demand Sparks Debate | Sakshi
Sakshi News home page

సర్కారు హాస్టల్స్‌లో గొడ్డు మాంసం?!

Sep 23 2026 8:25 AM | Updated on Sep 23 2026 8:31 AM

Beef in Tamil Nadu Government Hostels Students Demand Sparks Debate

తమిళనాడులోని ప్రభుత్వ విద్యార్థుల హాస్టళ్ల మెనూలో బీఫ్‌ను చేర్చే అంశం చర్చకు వచ్చింది. కొందరు విద్యార్థులు బీఫ్‌ను మెనూలో చేర్చాలని కోరడంతో విజయ్‌ సర్కార్‌ స్పందించింది. సంబంధిత అధికారులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని సామాజిక న్యాయశాఖ మంత్రి వన్నీ అరసు తెలిపారు. ఈ క్రమంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

చెన్నైలోని సైదాపేటలో ఉన్న ఎం.సి. రాజా సోషల్‌ జస్టిస్‌ హాస్టల్‌ను మంత్రి వన్నీ అరసు తాజాగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హాస్టళ్లలో విద్యార్థుల అభిప్రాయాలకు అనుగుణంగా మెనూలో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం హాస్టళ్లలో చికెన్‌, మటన్‌ వంటి నాన్‌వెజ్‌ వంటకాలు అందిస్తున్నామని.. సోమవారాల్లో బిర్యానీ కూడా అందించనున్నట్లు తెలిపారు.

మటన్‌ ఖరీదు.. బీఫ్‌ కోరిన విద్యార్థులు
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు విద్యార్థులు మటన్‌ ధర ఎక్కువగా ఉండటంతో తాము తరచూ తినలేమని చెప్పి.. దాని స్థానంలో బీఫ్‌ను మెనూలో చేర్చాలని కోరినట్లు మంత్రి వివరించారు. అలాగే విద్యార్థుల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా హాస్టల్‌ మెనూను దశలవారీగా మారుస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో మెనూలో ఉన్న ఉప్మా, సెమియా కిచిడీ వంటి కొన్ని వంటకాలను తొలగించి.. ఇడ్లీ, దోస వంటి అల్పాహారాలను చేర్చినట్లు చెప్పారు.

తీవ్రంగా వ్యతిరేకించిన కృష్ణసామి
బీఫ్‌ను హాస్టల్‌ మెనూలో చేర్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పుత్తియా తమిళగం పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ కే. కృష్ణసామి అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. హాస్టల్‌ విద్యార్థులకు ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, కొవ్వులు వంటి పోషకాలు సమతుల్యంగా అందేలా ఆహార మెనూ ఉండాలని ఆయన పేర్కొన్నారు.

తమిళనాడు ప్రభుత్వ హాస్టళ్లలో రోజూ గుడ్లు, వారానికి కనీసం రెండుసార్లు చికెన్‌, మటన్‌ అందించాలని తాను కోరుతున్నట్లు కృష్ణసామి తెలిపారు. బీఫ్‌ విషయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు తగవని, ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లకూడదని ఆయన కోరారు. అయితే వివాదం నేపథ్యంలో మంత్రి మంత్రి వన్నీ అరసు మరోసారి స్పందించారు. ఈ అంశం పరిశీలనలో మాత్రమే ఉందని అన్నారాయన.  హాస్టళ్లలోని విద్యార్థులందరి అభిప్రాయాలు ఒకేలా లేవని, అందుకే అధికారులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఇదీ చదవండి: నాకింత విషమిచ్చి చంపేయండి.. జడ్జి ముందు నటి కన్నీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement