బెంగళూరు: పలు కారణాలతో అనైతిక సంబంధాలు అధికమవుతున్నాయి. భర్తను వదిలేసి వెళ్లిన వివాహిత వైనం హాసన్‌లో సంచలనం కలిగిస్తోంది. భర్త రాజశేఖర్, ప్రియాంక దంపతులు ఉంటున్నారు. ఇటీవల ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాజశేఖర్ మాట్లాడుతూ ప్రియాంకకు గతంలోనే పెళ్లయి వదిలేసింది, ఆ విషయం చెప్పకుండా తనతో పెళ్లి చేశారని ఆరోపించాడు. మొదటి భర్త వద్దకు వెళ్లిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. తమను మోసం చేశారంటూ రాజశేఖర్ కుటుంబీకులు ప్రియాంక తల్లిదండ్రులతో గొడవకు దిగారు.
కుమార్తెను ప్రేమించాడని.. చంపేశారు
దొడ్డబళ్లాపురం: కుమార్తెను ప్రేమిస్తున్న యువకున్ని ఆమె తల్లితండ్రులు హత్య చేసిన ఘటన దావణగెరె జిల్లా మొళకాల్మూరు తాలూకా తళవారహళ్లిలో వెలుగుచూసింది. వివరాల మేరకు.. హానగల్ గ్రామానికి చెందిన నాగేశ్ (22), పొరుగూరు రుద్రమ్మనహళ్లికి చెందిన యువతి, రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. తమ కూతురి జోలికి రావద్దని యువతి తల్లిదండ్రులు అనేకసార్లు నాగేశ్‌ను హెచ్చరించినా మార్పు రాలేదు. ఆగ్రహానికి లోనైన యువతి తల్లిదండ్రులు మాట్లాడాలని నాగేశ్‌ని తళవారహళ్లి వద్ద నిర్జన ప్రదేశానికి పిలిపించారు. అక్కడ రాళ్లు, కత్తులతో హత్య చేసి పరారయ్యారు. 2 రోజుల కిందట జరిగిన హత్య మంగళవారం బయటపడింది. మొళకాల్మూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు, ఇంతలోనే నిందితులు ఊరు వదిలి పరారయ్యారు.


