పెళ్ళైన 18 రోజులకే నవవధువు ఆత్మహత్య | Hyderabad Constable Wife Ends Life | Sakshi
Sakshi News home page

పెళ్ళైన 18 రోజులకే నవవధువు ఆత్మహత్య

Sep 19 2026 1:18 PM | Updated on Sep 19 2026 2:31 PM

Hyderabad Constable Wife Ends Life

హైదరాబాద్‌: కళాశాల భవనంపై నుంచి దూకి బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఘట్‌కేసర్‌ పోలీసులు తెలిపిన వివరాలు... యాదాద్రి జిల్లా మూటకొండూరు మండలం తాటపల్లి గ్రామానికి చెందిన పల్లవి (20) ఎదులాబాద్‌ డివిజన్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ఆగస్టు 30న చైతన్యపురి పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్‌తో వివాహం జరిగింది. 

వివాహం అనంతరం గురువారం నుంచి కళాశాలకు హాజరవుతోంది. శుక్రవారం కళాశాలకు వెళ్లిన ఆమె విద్యార్థులందరూ వెళ్లిపోయిన తర్వాత మూడో అంతస్తుకు వెళ్లి దూకింది. కళాశాల సిబ్బంది మేడిపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు తెలిపారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్మకు గల కారణాలు తెలియరాలేదు.  

ఇదీ చదవండి: నర్సు కేసులో కీలక ఆధారం.. నిందితుడి డీఎన్‌ఏ మ్యాచ్‌!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement