స్పాల్లోకి వెళ్లిన పోలీసులు.. లోపల సీన్‌ చూసి షాక్‌! | Gurugram Spa Raid: Shocking Findings Emerge Viral | Sakshi
Sakshi News home page

స్పాల్లోకి వెళ్లిన పోలీసులు.. లోపల సీన్‌ చూసి షాక్‌!

Sep 19 2026 1:33 PM | Updated on Sep 19 2026 1:48 PM

Gurugram Spa Raid: Shocking Findings Emerge Viral

స్పా సెంటర్ల మాటున చీకటి దందాలు జరగడం కొత్తేమీ కాదు. అయితే పోలీసుల తనిఖీల్లో సైతం బయటపడకుండా కొందరు నిర్వాహకులు పక్కా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఇలాంటి నేపథ్యంలో ఓ ప్రముఖ మాల్‌లోని స్పా సెంటర్లపై పోలీసులు చడీచప్పుడు లేకుండా మెరుపుదాడులు నిర్వహించారు. ఒకటి కాదు.. ఏకంగా 18 స్పాల్లో ఒకేసారి సోదాలు చేశారు. అయితే అక్కడ లోపల కనిపించిన సీన్లు, అక్కడ లభించిన వస్తువులు చూసి పోలీసులే అవాక్కయ్యారు.

హరియాణాలోని గురుగ్రామ్‌లో గత రాత్రి జరిగిన స్పా సెంటర్‌లపై గురుగ్రామ్‌ పోలీసులు, హరియాణా రాష్ట్ర మహిళా కమిషన్‌ జాయింట్‌గా నిర్వహించిన తనిఖీలు.. ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారి తీశాయి. ఆ సమయంలో తలుపులు తీయకుండా నిర్వాహకులు ప్రయత్నించగా.. వెల్డింగ్‌ మెషీన్లతో తెరిపించి బలవంతంగా పోలీసులు లోపలికి వెళ్లారు. 

లోపల మరో ప్రపంచమే!
సెక్టార్‌-90లో ఉన్న సఫైర్‌ 90 మాల్‌లో గత అర్ధరాత్రి ఈ భారీ ఆపరేషన్‌ జరిగింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సుమారు ఐదు గంటలపాటు మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ ఉషా ప్రియదర్శిని, ఆమె బృందం, డ్యూటీ మేజిస్ట్రేట్‌ సమక్షంలో పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు.  

స్పా సెంటర్‌ల కోసం ఏర్పాటు చేసిన బోర్డుల వెనుక.. ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. ఆ తలుపులు తెరిచి లోపలికి వెళ్లగా.. లోపల దృశ్యాలు చూసి అవాక్కయ్యారు. అలాగే కొన్ని స్పా కేంద్రాలకు బయట నుంచి తాళాలు వేసి ఉండగా.. తెరిచి లోపలికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. లోపల ప్రత్యేక గదులతో పాటు సెక్స్‌ టాయ్స్‌, కొన్ని వస్తువులు కనిపించాయి. అలాగే 30 మంది మహిళలు, 20 మంది పురుషులు అభ్యంతరకర పరిస్థితుల్లో కనిపించారు. వాళ్లలో కొందరు వీడియోలు తీయొద్దంటూ పోలీసులను వేడుకున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. కొందరు నిర్వాహకులు అందులోని వస్తువుల్ని డస్ట్‌ బిన్‌లలో పడేసి దాక్కునే ప్రయత్నం చేశారు. 

తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ సోదాలు కొనసాగగా.. దాదాపు 100 మంది పోలీసులు పాల్గొన్నారు. ఆ సెంటర్‌ల నుంచి ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ పరికరాలతో పాటు ఇతర వస్తువులు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాళ్లందరినీ స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. అసలు.. అంత పెద్ద మాల్‌లో చీకటి కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయి? వాటి వెనుక ఎవరున్నారు? ఎవరైనా పెద్దల పాత్ర ఉందా? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement