రైలు ప్రయాణంలో టికెట్ తనిఖీ సాధారణమే. టికెట్ లేకపోతే జరిమానా చెల్లించాలి.. లేదంటే నిబంధనల ప్రకారం చర్యలు ఎదుర్కోవాలి. కానీ ఓ మహిళ మాత్రం టికెట్ అడిగిన టికెట్ ఎగ్జామినర్‌తో వాగ్వాదానికి దిగి.. చివరకు తన దుస్తులనే చించేసుకుంది. అంతటితో ఆగకుండా ఆయనపై తీవ్ర ఆరోపణలు చేయడంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో రైలులో ప్రయాణిస్తున్న మహిళను యువతి చూపించమని టీటీఈ అడిగాడు. అయితే ఆమె వద్ద టికెట్ లేకపోవడంతో డ్రామాకు దిగింది. అదే సమయంలో తన సోదరుడు కూడా రైల్వేలో టీటీఈగా పని చేస్తాడని కబర్లు చెప్పింది. ఈ క్రమంలో వాళ్లిద్దరి మధ్య మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు చేస్తూ.. ఆ యువతి ఒక్కసారిగా తన దుస్తులను తానే చించుకోవడం ప్రారంభించింది. దీంతో అక్కడున్నవాళ్లంతా కంగుతిన్నారు. ఆపై టీటీఈ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది.
ఫోన్‌లో రికార్డ్ చేయడంతో..
అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని టీటీఈ తన ఫోన్‌లో రికార్డ్ చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఎలాంటి గొడవకు దిగకుండా ప్రశాంతంగా వ్యవహరించిన ఆయన.. అత్యవసర పరిస్థితి అనుకుంటే 112కు ఫోన్ చేయాలని మహిళకు సూచించినట్లు తెలుస్తోంది.
ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ మొదలైంది. ఘటనను రికార్డ్ చేయడం వల్ల టీటీఈపై తర్వాత ఎలాంటి ఆరోపణలు వచ్చినా అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆధారం ఉంటుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. రైల్వే సిబ్బందికి బాడీ కెమెరాలు అందుబాటులో ఉంచితే ఇలాంటి వివాదాల్లో మరింత స్పష్టమైన ఆధారాలు ఉంటాయని కొందరు సూచిస్తున్నారు.
రైల్వే సిబ్బందికి కొత్త సవాల్
ప్రయాణికులతో నిత్యం నేరుగా వ్యవహరించే టీటీఈలు, ఇతర ఫ్రంట్‌లైన్ రైల్వే సిబ్బందికి ఇలాంటి వివాదాలు కొత్త సవాలుగా మారుతున్నాయి. టికెట్ తనిఖీల సమయంలో ప్రయాణికులు, సిబ్బంది మధ్య వాగ్వాదాలు చోటుచేసుకునే సందర్భాలు ఉంటాయి. అలాంటి సమయంలో ఇరువైపులా ఉన్న వారి ప్రవర్తనను రికార్డ్ చేసే వ్యవస్థ ఉంటే వాస్తవాన్ని నిర్ధారించడం సులభమవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనేదానిపై స్పష్టత లేదు. సోషల్‌మీడియాలో మాత్రం ట్రెండ్ అవుతోంది. అయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) జోక్యం చేసుకున్నట్లు సమాచారం. మహిళకు జరిమానా విధించినట్లు కూడా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి అధికారిక వివరాలు, కేసులో నమోదైన ఆరోపణలు తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
Woman tears off her clothes to accuse TT of molestation when he asked her to show ticket
Neither Indian Police Nor Indian Judiciary knows how to handle such women
Men in all such services should be provided bodycams to save themselves from false cases pic.twitter.com/ZoaV3HmBek— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) September 19, 2026
ఇదీ చదవండి: రాజా సాబ్ వార్నింగ్ వీడియో వైరల్


