మహిళ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్‌ | Railway Police-constable Dragged Woman-by-her-Hair-Hafeezpet | Sakshi
Sakshi News home page

హఫీజ్‌పేట్‌లో దారుణం.. మహిళ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్‌

Sep 19 2026 1:06 AM | Updated on Sep 19 2026 1:22 AM

Railway Police-constable Dragged Woman-by-her-Hair-Hafeezpet

హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ పరిధిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మియాపూర్‌-హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ సమీపంలో ఒక మహిళను రైల్వే పోలీస్ కానిస్టేబుల్ విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా, ఆమె జుట్టును పట్టుకొని నేలపై ఈడ్చుకుంటూ వెళ్లడం గమనార్హం. అయితే మహిళను కొట్టడం వెనుక కారణాలు ఏంటనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

అయితే సదరు మహిళను రైల్వే కానిస్టేబుల్‌ ఈడ్చుకెళుతున్న సమయంలో భర్త, కూతురు ఆమెను వదిలేయాలంటూ కానిస్టేబుల్‌ను వేడుకున్నారు. కానీ మాట వినిపించుకోని కానిస్టేబుల్‌ వాళ్లను నెట్టివేసి ఆమెను తన వాహనం వద్దకు ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

ఇదీ చదవండి: టీ20 క్రికెట్‌లో ష‌ఫాలీ వ‌ర్మ అరుదైన ఫీట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement