Photo Credit: BCCI Twitter
భారత మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ టీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డు సాధించింది. ఒక క్యాలండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో షఫాలీ వర్మ రెండో స్థానంలో నిలిచింది. 2026లో షఫాలీ వర్మ 26 సిక్సర్లు కొట్టింది. అయితే ఈ జాబితాలో శ్రీలంక కెప్టెన్ చమేరీ ఆటపట్టు (32 సిక్సర్లు, 2024 ఏడాదిలో) తొలి స్థానంలో కొనసాగుతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ (2018లో 25 సిక్సర్లు), సోఫీ డివైన్ (2018లో 21 సిక్సర్లు, 2020లో 21 సిక్సర్లు) మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.
మహిళల టీ20 క్రికెట్‌లో బంతుల పరంగా భారత్ 90 బంతులు మిగిలి ఉండగానే జపాన్ విజయం సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో జింబాబ్వే మహిళల జట్టు (108 బంతులు వర్సెస్ ఎస్వాటిని), ఐర్లాండ్ మహిళలు (104 బంతులు వర్సెస్ ఫ్రాన్స్ ), జింబాబ్వే మహిళలు (98 బంతులు వర్సెస్ నైజిరీయా) రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్ మహిళల జట్టు 19.5 ఓవర్లలో 57 పరుగులకు ఆలౌటైంది. అయకా కాటో స్టాఫోర్డ్ (25) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో శ్రీ చరణి 4 వికెట్లతో చెలరేగగా, షఫాలీ వర్మ 2, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. షఫాలీ వర్మ (15 బంతుల్లో 40 నాటౌట్) దనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా, రిచా ఘోష్ (12 నాటౌట్) ఆకట్టుకుంది. జపాన్ బౌలర్లలో నొనొహా యుమొటొ, అయ్‌కా కాటో చెరొక వికెట్ తీశారు.
𝙎𝙝𝙪𝙧𝙪 𝙝𝙤𝙩𝙚 𝙝𝙞 𝙠𝙝𝙖𝙩𝙖𝙢 😅
Japan were bowled out for 58, and India wrapped it up in just 4.6 overs - with Shafali Verma putting the finishing touch with a six✨
Catch India vs Japan at the Asian Games, LIVE NOW on Sony Sports Network & Sony LIV.… pic.twitter.com/nTfQ1rVlx5— Sony Sports Network (@SonySportsNetwk) September 18, 2026
ఇదీ చదవండి: ఉత్తర కొరియా వల్ల 1,399 భూకంపాలు!


