హెడ్ తుఫాన్ సెంచరీ.. రికార్డు స్కోర్ సాధించిన ఆస్ట్రేలియా! | Travis Head Ton Takes Australia To Record Total Vs Zimbabwe | Sakshi
Sakshi News home page

AUS vs ZIM: హెడ్ తుఫాన్ సెంచరీ.. రికార్డు స్కోర్ సాధించిన ఆస్ట్రేలియా!

Sep 18 2026 7:04 PM | Updated on Sep 18 2026 7:18 PM

Travis Head Ton Takes Australia To Record Total Vs Zimbabwe

PC: CA Twitter

హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు జూలు విదిల్చారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (84 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 112) భారీ సెంచరీతో కదం తొక్కగా.. కెప్టెన్ మిచెల్ మార్ష్ (53), కూపర్ కొన్నోలీ (78) హాఫ్ సెంచరీలతో రాణించారు.

ఆఖరిలో ఆలివర్ పీక్ (18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 41) మెరుపులు మెరిపించాడు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోరు సాధించింది. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ మూడు, స్పిన్నర్ వెల్లింగ్టన్ మసకద్జా రెండు వికెట్లు తీశారు.

విధ్వంసకర సెంచరీతో చెలరేగిన హెడ్ ఒక అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో జింబాబ్వేపై అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆస్ట్రేలియన్ బ్యాటర్‌గా కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు మాట్ రెన్‌షా (86 బంతులు) పేరిట ఉండగా.. తాజా మ్యాచ్‌లో కేవలం 75 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకొని హెడ్ దానిని అధిగమించాడు. 

అంతేకాకుండా వన్డేల్లో జింబాబ్వేపై ఆస్ట్రేలియాకు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. గతంలో 2014లో ఇదే హరారే మైదానంలో ఆసీస్ చేసిన 350 పరుగుల రికార్డును ప్రస్తుత మ్యాచ్‌తో తిరగరాశారు.
చదవండి: AUS vs ZIM: ట్రావిస్‌ హెడ్‌ విధ్వంసం.. ఫాస్టెస్ట్‌ సెంచరీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement