ట్రావిస్‌ హెడ్‌ విధ్వంసం.. ఫాస్టెస్ట్‌ సెంచరీ! | Travis Head smashed Australia’s fastest-ever ODI hundred against Zimbabwe | Sakshi
Sakshi News home page

AUS vs ZIM: ట్రావిస్‌ హెడ్‌ విధ్వంసం.. ఫాస్టెస్ట్‌ సెంచరీ!

Sep 18 2026 4:05 PM | Updated on Sep 18 2026 4:47 PM

Travis Head smashed Australia’s fastest-ever ODI hundred against Zimbabwe

ఆస్ట్రేలియా స్టార్ ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ త‌న ఫామ్‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు బ్యాట్‌తోనే స‌మాధాన‌మిచ్చాడు. హ‌రారే వేదిక‌గా జింబాబ్వేతో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో హెడ్ అద్భుత సెంచ‌రీతో చెల‌రేగాడు.  తొలి వ‌న్డేలో ఘోరంగా విఫ‌ల‌మైన హెడ్‌.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఆతిథ్య జ‌ట్టును బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు. 

మైదానం న‌లుమూల‌ల బౌండ‌రీలు బాదుతూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన హెడ్.. కేవ‌లం 75 బంతుల్లోనే త‌న 8వ వ‌న్డే సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 84 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 112 ప‌రుగులు చేసి పెవిలియన్ చేరాడు.

ఈ ఇన్నింగ్స్‌తో హెడ్ ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. వ‌న్డేల్లో జింబాబ్వేపై అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆస్ట్రేలియా ప్లేయ‌ర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు మాట్ రెన్‌షా పేరిట ఉండేది. 

హరారేలో జ‌రిగిన తొలి వ‌న్డేలో రెన్‌షా 86 బంతుల్లో శతకం సాధించగా, కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఆ రికార్డును హెడ్‌ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. 45 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 295 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

తుది జట్లు
జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, ఇన్నోసెంట్ కైయా, బ్రెండన్ టేలర్(వికెట్‌ కీపర్‌), క్రెయిగ్ ఎర్విన్, సికందర్ రజా(కెప్టెన్‌), వెస్లీ మాధవెరె, బ్రాడ్ ఎవాన్స్, వెల్లింగ్టన్ మసకద్జా, న్యూమాన్ న్యామ్‌హురి, బ్లెస్సింగ్ ముజరబానీ

ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, కూపర్ కానలీ, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ క్యారీ, మాట్ రెన్‌షా, ఆలివర్ పీక్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్, బిల్లీ స్టాన్లేక్
చదవండి: SA vs AUS: సౌతాఫ్రికాకు ఊహించని షాక్‌! ఇక అంతే సంగతి?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement