PC: CA Twitter
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో 84 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో ఆసీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా తొలుత ఆస్ట్రేలియాను బ్యాటింగ్ అహ్హనించాడు.
ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ సాధించింది. స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (84 బంతుల్లో 112 రన్స్ - 15 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. యంగ్ ఆల్‌రౌండర్ కూపర్ కానల్లీ (78), కెప్టెన్ మిచెల్ మార్ష్ (53) అర్ధశతకాలు సాధించారు.
ఆఖరిలో ఆలివర్ జాన్ పీక్ (18 బంతుల్లో 41) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 48.3 ఓవర్లలో 272 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో బ్రెండన్ టేలర్ (39), సికందర్ రాజా (45), ఇన్నోసెంట్ కైయా (34) రాణించినప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, కూపర్ కొన్నోలీ, ఆడమ్ జంపా, మాట్ రెన్‌షా తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఇక ఈ మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటర్ ఇన్నోసెంట్ కైయా వికెట్ తీయడం ద్వారా వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని జంపా అందుకున్నాడు. తద్వారా ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో షేన్ వార్న్ (293 వికెట్లు) తర్వాత వన్డేల్లో 200 పైగా వికెట్లు తీసిన రెండో స్పిన్నర్‌గా నిలిచాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా తరఫున వేగంగా (123 మ్యాచ్‌ల్లో) 200 వన్డే వికెట్లు సాధించిన స్పిన్నర్‌గా షేన్ వార్న్ రికార్డును అధిగమించాడు.
చదవండి: IND vs AUS: ద్రవిడ్, సెహ్వాగ్ కొడుకుల జోరు.. ఆసీస్‌పై భారత్ సంచలన విజయం


