బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (PC: BCCI X)
దేశవాళీ క్రికెట్‌లో పని చేస్తున్న అంపైర్లు, రిఫరీల వేతనాలను పెంచాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. 2026–27 సీజన్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అక్టోబర్ 11న రంజీ ట్రోఫీ ప్రారంభం కానుండగా, అప్పటి నుంచి కొత్త వేతనాలు వర్తిస్తాయి.
ముంబైలో శుక్రవారం నాటి బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో దీనిపై అధికారికంగా ఆమోద ముద్ర వేస్తారు. దేశవాళీ అంపైర్లను ఎ, బి, సీ, డీ అనే నాలుగు గ్రేడ్‌లుగా విభజిస్తారు.
రూ. 40 వేల చొప్పున
తొలి రెండు గ్రేడ్‌లలో ఉన్నవారు సీనియర్ స్థాయి మ్యాచ్‌లకు, తర్వాతి రెండు గ్రేడ్‌లలో ఉన్నవారు జూనియర్ స్థాయి మ్యాచ్‌లకు బాధ్యతలు నిర్వర్తిస్తారు.
ప్రస్తుతం దేశంలో బీసీసీఐ గుర్తింపు పొందిన 20 మంది అంపైర్లకు రోజుకు రూ.40 వేల చొప్పున, ఇతర అంపైర్లు రోజుకు రూ.30 వేల చొప్పున ఇస్తున్నారు. టీ20 మ్యాచ్‌లకైతే రోజుకు రూ.20 వేలు లభిస్తాయి. రోజూవారీ భత్యం కింద ఇచ్చే రూ.500– రూ.1500 వరకు ఇచ్చే మొత్తం దీనికి అదనం.


