ఈసారి భారత్‌లోనే ఐపీఎల్‌ వేలం  | IPL 2027 auction back to India Says Ipl chairman Arun Dhumal | Sakshi
Sakshi News home page

ఈసారి భారత్‌లోనే ఐపీఎల్‌ వేలం 

Sep 17 2026 6:29 AM | Updated on Sep 17 2026 6:29 AM

IPL 2027 auction back to India Says Ipl chairman Arun Dhumal

న్యూఢిల్లీ: మూడేళ్ల విరామం తర్వాత ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వేలం కార్యక్రమం భారత్‌లో జరగనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ ధ్రువీకరించారు. ‘ప్రతి ఏడాది ఐపీఎల్‌ వేలం కార్యక్రమం భారత్‌లోనే నిర్వహించాలని అనుకుంటాం. కానీ పెళ్లిళ్ల సీజన్‌ కారణంగా వేదిక లభించడం కష్టమవుతోంది. అయితే ఈసారి మాత్రం ఐపీఎల్‌ వేలం భారత్‌లోనే ఉంటుంది. 

ఈసారి మినీ వేలం కావడంతో వేదిక లభిస్తుందనే ఆశిస్తున్నాం’ అని రేపు జరిగే బీసీసీఐ ఏజీఎంలో మరోసారి ఐపీఎల్‌ చైర్మన్‌గా ఎన్నిక కానున్న అరుణ్‌ ధుమాల్‌ తెలిపారు. ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ నిబంధనను కొనసాగించాలా వద్దా అనే అంశంపై ఫ్రాంచైజీలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. 2024 ఐపీఎల్‌ వేలం జిద్దాలో... 2025 ఐపీఎల్‌ వేలం దుబాయ్‌లో... 2026 వేలం అబుదాబిలో నిర్వహించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement