సమర్‌కండ్ (ఉజ్బెకిస్తాన్): చెస్ ఒలింపియాడ్‌లో డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగిన భారత పురుషుల, మహిళల జట్లు గెలుపు బోణీ కొట్టాయి. బుధవారం మొదలైన ఈ మెగా టోర్నీ తొలి రౌండ్‌లో భారత మహిళల జట్టు 4–0తో డొమినికన్ రిపబ్లిక్ జట్టును ఓడించింది.
బోర్డు–1పై ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 31 ఎత్తుల్లో ఫ్రాంచెస్కా రమిరెజ్‌పై... బోర్డు–2పై వైశాలి 31 ఎత్తుల్లో మిగెలినా డెలారోసాపై... బోర్డు–3పై వంతిక అగర్వాల్ 50 ఎత్తుల్లో మేరీ గొంజాలెజ్‌పై... బోర్డు–4పై సవితాశ్రీ 38 ఎత్తుల్లో కార్లా నునెజ్ దియాపై గెలుపొందారు.
మరోవైపు భారత పురుషుల జట్టు 3–1తో థాయ్‌లాండ్ జట్టుపై విజయం సాధించింది. బోర్డు–1పై తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 54 ఎత్తుల్లో ప్రిన్ లావోహవిరాపాప్ చేతిలో అనూహ్యంగా ఓడిపోగా... బోర్డు–2పై నిహాల్ సరీన్ 28 ఎత్తుల్లో థానాడోన్ కుల్‌ప్రథనోన్‌పై... బోర్డు–3పై దొమ్మరాజు గుకేశ్ 37 ఎత్తుల్లో ఫారిస్ రషీద్‌పై... బోర్డు–4పై విదిత్ గుజరాతి 30 ఎత్తుల్లో తుఫా ఖుమ్నోరఖెవ్‌పై గెలిచారు.


