కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌ ఎంపిక​ | BCCI Selectors Has announced Rest of India squad for Irani Cup, pant named as captain | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌ ఎంపిక​

Sep 16 2026 9:03 PM | Updated on Sep 16 2026 9:03 PM

BCCI Selectors Has announced Rest of India squad for Irani Cup, pant named as captain

source: BCCI X

బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ ఇవాళ వెస్టిండీస్‌ సిరీస్‌కు భారత జట్ల ప్రకటనతో పాటు ఇరానీ కప్‌ 2026 కోసం రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా జట్టును కూడా ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌ను ఎంపిక చేసింది. పంత్‌కు విండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు ఎంపిక​ చేసిన జట్లలో చోటు దక్కలేదు.

రంజీ ట్రోఫీ 2025-26 విజేత జమ్మూ కశ్మీర్‌తో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు ఇరానీ కప్‌లో తలపడనుంది. ఈ వన్-ఆఫ్ మ్యాచ్ అక్టోబర్ 1 నుంచి 5 వరకు శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో జరగనుంది.

ఇరానీ కప్ కోసం రెస్ట్ ఆఫ్ ఇండియ జట్టు
రిషబ్ పంత్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), సనత్ సాంగ్వాన్, శిఖర్ మోహన్, సుదీప్ ఘరామి, సర్ఫరాజ్ ఖాన్ (వైస్ కెప్టెన్), స్మరణ్ రవిచంద్రన్, మానవ్ సుతార్, సరాన్ష్ జైన్, ఆకాశ్ దీప్ (ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి), ముఖేష్ కుమార్, ముకేష్ చౌదరి, ఆర్యన్‌ జుయల్‌ (వికెట్‌కీపర్‌), ఆర్యన్‌ పాండే, అనుకూల్ రాయ్, ఆయుష్ దోసెజా

ఇదీ చదవండి: విండీస్‌ సిరీస్‌కు భారత జట్ల ప్రకటన.. రోహిత్‌, కోహ్లి కొనసాగింపు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement