source: X
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఐదో సీజన్‌కు (2027) సంబంధించి బిగ్ అప్‌డేట్స్ వచ్చాయి. అక్టోబర్ 28న కొచ్చిలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో వేలం జరుగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 మధ్యలో టోర్నీ జరుగనున్నట్లు వెల్లడించింది. రిటెన్షన్ ప్రక్రియకు సెప్టెంబర్ 28 చివరి తేదీగా పేర్కొంది. టోర్నీకి సంబంధించిన వేదికలను మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు.
ముంబై, వడోదరలో మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత సీజన్‌లో కూడా ఈ రెండు నగరాల్లోనే మ్యాచ్‌లు జరిగాయి. సీజన్-4 ఫైనల్‌ను ఫిబ్రవరి 5న వడోదరలో నిర్వహించారు.
సెప్టెంబర్ 28లోగా రిటెన్షన్లు
ఐదు జట్లకు ప్లేయర్ల రిటెన్షన్, రిలీజ్‌పై నిర్ణయం తీసుకునేందుకు సెప్టెంబర్ 28 వరకు గడువు ఇచ్చారు. ప్రతి జట్టులో గరిష్ఠంగా 18 మంది ప్లేయర్లు ఉండవచ్చు. ఇందులో గరిష్ఠంగా ఆరుగురు విదేశీ ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత సైకిల్‌కు సంబంధించిన జట్టు శాలరీ క్యాప్ రూ.15 కోట్లుగా ఉంది.
కాగా, గత WPL సీజన్‌లో ఆర్సీబీ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది, తమ రెండో టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఇదీ చదవండి: పాక్ ప్లేయర్‌ను కిందకు తోసిన అభిషేక్


