రెచ్చిపోయిన స్పిన్నర్లు.. పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా | Womens Asia cup 2026: India beat Pakistan in group stage match | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన స్పిన్నర్లు.. పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా

Sep 5 2026 10:17 PM | Updated on Sep 5 2026 10:27 PM

Womens Asia cup 2026: India beat Pakistan in group stage match

source: BCCI X

మహిళల ఆసియా కప్‌ 2026లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్‌ 5) జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేసిన టీమిండియా పాక్‌ను 18.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూల్చింది. టీ20 క్రికెట్‌లో పాక్‌ మహిళల జట్టుకు ఇదే అత్యల్ప స్కోర్‌.

భారత బౌలర్లలో శ్రీచరణి (4-0-7-3), ప్రేమా రావత్‌ (4-0-9-3), దీప్తి శర్మ (3.1-0-5-2), షఫాలీ వర్మ (3-0-10-1) చెలరేగిపోయారు. వీరి దెబ్బకు పాక్‌ ఇన్నింగ్స్‌లో కేవలం ఇద్దరు (ఓపెనర్లు మునీబా అలీ (13), షావాల్‌ జుల్ఫికర్‌ (14)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ముగ్గురు డకౌట్లు కాగా.. అయేషా జాఫర్‌ 2, సదాఫ్‌ షమాస్‌ 3, ఎమ్యాన్‌ ఫాతిమా 5, ఉమ్‌ ఏ హనీ 6, తుబా హస్సన్‌ 9 పరుగులు చేశారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ కేవలం 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ ఛేదించింది. షఫాలీ వర్మ (12), స్మృతి మంధన (9), ప్రతీకా రావల్‌ (4) స్వల్ప స్కోర్లకే ఔటైనప్పటికీ.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (18 నాటౌట్‌), దీప్తి శర్మ (12 నాటౌట్‌) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. పాక్‌ బౌలర్లలో కెప్టెన్‌ ఫాతిమా సనాకే 3 వికెట్లు దక్కాయి. ఈ గెలుపుతో భారత్‌ గ్రూప్‌ దశను అజేయంగా (3 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ముగించి సెమీస్‌కు అర్హత సాధించింది. 

చదవండి: శ్రీ చ‌ర‌ణి ప్ర‌పంచ రికార్డు.. 55 ప‌రుగుల‌కే పాక్‌ ఆలౌట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement