మహ్మద్‌ నబీ అరుదైన రికార్డు | IND VS AFG 2nd T20I: Mohammad Nabi Attains Unique T20I Record | Sakshi
Sakshi News home page

మహ్మద్‌ నబీ అరుదైన రికార్డు

Sep 16 2026 7:42 PM | Updated on Sep 16 2026 8:00 PM

IND VS AFG 2nd T20I: Mohammad Nabi Attains Unique T20I Record

source: X

ఆఫ్ఘనిస్తాన్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 అంతర్జాతీయాల్లో 2500 పరుగులు, 100 ప్లస్‌ వికెట్లు తీసిన నాలుగో ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. భారత్‌తో నిన్న జరిగిన రెండో టీ20లో నబీ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 14 బంతుల్లో 20 పరుగులు చేసిన నబీ, 2500 పరుగులు పూర్తి చేశాడు.

నబీకి (2501, 111) ముందు బంగ్లా ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ (2551 పరుగులు, 149 వికెట్లు), జింబాబ్వే ఆల్‌రౌండర్‌ సికందర్‌ రజా (3244, 114), మలేషియా ఆల్‌రౌండర్‌ విరన్‌దీప్‌ సింగ్‌ (3402, 126) ఈ ఘనత సాధించారు.

ఈ మ్యాచ్‌తో నబీ మరో ఘనత కూడా సాధించాడు. భారత గడ్డపై టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన మూడో అత్యంత వయసైన (41 సంవత్సరాల 257 రోజులు) క్రికెటర్‌గా నిలిచాడు. ఈ రికార్డుకు సంబంధించి హాంకాంగ్‌కు చెందిన ర్యాన్ క్యాంప్‌బెల్ (44 సంవత్సరాల 34 రోజుల వయసులో) అగ్రస్థానంలో ఉండగా.. ఇటలీకి చెందిన వేన్ మాడ్సెన్ (42 సంవత్సరాల 38 రోజులు) రెండో స్థానంలో ఉన్నాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. భారత్‌ ఆఫ్ఘనిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ ని​ర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరగులు చేయగా.. భారత్‌ కేవలం 14.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

ఇదీ చదవండి: రోహిత్‌ శర్మను అధిగమించిన బట్లర్‌.. మిగిలింది అతనొక్కడే..!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement