source: BCCI X
ఈ నెలాఖరులో వెస్టిండీస్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం భారత జట్లను ఇవాళ ప్రకటించారు. వన్డే జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్, టీ20 జట్టుకు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ కొనసాగారు. కేఎల్ రాహుల్, తిలక్ వర్మ వన్డే, టీ20 జట్లకు ఉప నాయకులుగా వ్యవహరించనున్నారు.
స్టార్ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వన్డే జట్టులో కొనసాగగా.. రిషబ్ పంత్‌కు అవకాశం దక్కలేదు. ఆకిబ్ నబీ, నమన్ ధిర్‌కు తొలిసారి వన్డే జట్టులో అవకాశం దక్కింది. స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. రెండు జట్లలో అతడికి చోటు దక్కలేదు.
వన్డే సిరీస్‌కు భారత జట్టు
శుభ్‌మన్ గిల్ (సి), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ధృవ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మహ్మద్ సిరాజ్, ఆకిబ్ నబీ, యశస్వి జైస్వాల్, నమన్ ధిర్
టీ20 సిరీస్‌కు భారత జట్టు
శ్రేయస్ అయ్యర్ (సి), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), సంజు శాంసన్ (వికెట్‌కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.
వన్డే సిరీస్ షెడ్యూల్
తొలి వన్డే: ఆదివారం, సెప్టెంబర్ 27 - మధ్యాహ్నం 2:00 గంటలకు - గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం
రెండో వన్డే: బుధవారం, సెప్టెంబర్ 30 - మధ్యాహ్నం 2:00 గంటలకు - బర్సపారా క్రికెట్ స్టేడియం, గౌహతి
మూడో వన్డే: శనివారం, అక్టోబర్ 3 - మధ్యాహ్నం 2:00 గంటలకు - మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ముల్లన్‌పూర్, న్యూ చండీగఢ్
టీ20 సిరీస్ షెడ్యూల్
తొలిటీ20: మంగళవారం, అక్టోబర్ 6 - సాయంత్రం 7:00 గంటలకు - భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియం, లక్నో
రెండో టీ20: శుక్రవారం, అక్టోబర్ 9 - సాయంత్రం 7:00 గంటలకు - జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్, రాంచీ
మూడో టీ20: ఆదివారం, అక్టోబర్ 11 - సాయంత్రం 7:00 గంటలకు - హోల్కర్ స్టేడియం, ఇండోర్
నాలుగో టీ20: బుధవారం, అక్టోబర్ 14 - సాయంత్రం 7:00 గంటలకు - రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, హైదరాబాద్
ఐదో టీ20: శనివారం, అక్టోబర్ 17 - సాయంత్రం 7:00 గంటలకు - ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
ఇదీ చదవండి: రోహిత్ శర్మను అధిగమించిన బట్లర్.. మిగిలింది అతనొక్కడే..!


