source: X
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో (పూర్తి సభ్య దేశాల బౌలర్లలో) అత్యధిక మెయిడిన్ ఓవర్లు (13) వేసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న రెండో టీ20లో ఇన్నింగ్స్ తొలి ఓవరే మెయిడిన్ వేసి ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్‌కు ముందు బుమ్రా, జింబాబ్వే పేసర్ రిచర్డ్ నగరవ చెరో 12 మెయిడిన్ ఓవర్లతో సమంగా ఉండేవారు. తాజాగా బుమ్రా సోలోగా ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 10 మెయిడిన్ ఓవర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తుంది. 17.4 ఓవర్లు ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 132-6గా ఉంది. ఇబ్రహీం జద్రాన్ 37, రహ్మానుల్లా గుర్బాజ్ 0, సెదిఖుల్లా అటల్ 12, గుల్బదిన్ నైబ్ 10, దర్విష్ రసూలీ 26, అజ్మతుల్లా ఒమర్‌జాయ్ 11 పరుగులు చేసి ఔట్ కాగా.. మొహమ్మద్ నబీ (15), రషీద్ ఖాన్ (17) క్రీజ్‌లో ఉన్నారు.
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి తలో 2 వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచిన భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.
ఇదీ చదవండి: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు


