source: BCCI X
భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20 కెప్టెన్‌గా మొదటి 12 మ్యాచ్‌ల్లో అత్యధిక సార్లు (11) టాస్ గెలిచిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20లో టాస్ గెలవడంతో ఈ ఘనత సాధించాడు. ఖతార్ కెప్టెన్ మిర్జా బేగ్ (10), ఫిలిప్పీన్స్ కెప్టెన్ హెన్రీ టైలర్ (10)ను అధిగమించి సోలోగా ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.
ఐసీసీ పూర్తి సభ్య దేశాల కెప్టెన్లను పరిశీలిస్తే.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మహ్మదుల్లా తమ తొలి 12 టీ20ల్లో తొమ్మిది సార్లు టాస్ గెలిచారు. శ్రేయస్ వీరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. విరాట్ కోహ్లీ, లిటన్ దాస్, షై హోప్ వంటి ప్రముఖ కెప్టెన్లు తమ తొలి 12 టీ20ల్లో కేవలం రెండేసి టాస్ విజయాలు మాత్రమే సాధించి ఈ జాబితాలో అట్టడుగు స్థానాల్లో ఉన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. శ్రేయస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఓ మార్పు చేయగా.. ఆఫ్ఘనిస్తాన్ తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. వరుణ్ చక్రవర్తి గాయపడటంతో అతడి స్థానంలో రవి బిష్ణోయ్ జట్టులోకి వచ్చాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచిన భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.
3 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్
శ్రేయస్ అయ్యర్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 9.2 ఓవర్లలో 59 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, నితీశ్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీశారు. ఆఫ్ఘన్ బ్యాటర్లలో కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ 37, రహ్మానుల్లా గుర్బాజ్ 0, సెదిఖుల్లా అటల్ 12 పరుగులు చేసి ఔట్ కాగా.. గుల్బదిన్ నైబ్ (7) క్రీజ్‌లో ఉన్నాడు.
ఇదీ చదవండి: సచిన్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన జింబాబ్వే ప్లేయర్


