శతక్కొట్టిన రెన్షా.. ఆస్ట్రేలియా భారీ స్కోర్‌ | Matt Renshaw Scores Maiden ODI hundred, Australia score 294 for 8 in 1st ODI Vs Zimbabwe | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన రెన్షా.. ఆస్ట్రేలియా భారీ స్కోర్‌

Sep 15 2026 5:35 PM | Updated on Sep 15 2026 6:26 PM

Matt Renshaw Scores Maiden ODI hundred, Australia score 294 for 8 in 1st ODI Vs Zimbabwe

source: X

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం వరల్డ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (సెప్టెంబర్‌ 15) తొలి వన్డే జరుగుతుంది. హరారే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.

మిడిలార్డర్‌ బ్యాటర్‌ మ్యాట్‌ రెన్షా (109) తన కెరీర్‌లో తొలి వన్డే శతకంతో కదంతొక్కడంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్‌ (294-4) చేసింది. రెన్షాతో పాటు ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో కూపర్‌ కన్నోల్లీ (51) కూడా రాణించాడు. కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (36), ఒలివర్‌ పీక్‌ (30), అలెక్స్‌ క్యారీ (27) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ట్రవిస్‌ హెడ్‌ (4), జోష్‌ ఇంగ్లిస్‌ (4), జేవియర్‌ బార్ట్‌లెట్‌ (5) నిరాశపరిచారు. జింబాబ్వే బౌలర్లలో న్యుమ్యాన్‌ న్యామ్హురి (5-62) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. బ్రాడ్‌ ఈవాన్స్‌ 2, కెప్టెన్‌ సికందర్‌ రజా ఓ వికెట్‌ పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడంతో జింబాబ్వే వెటరన్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ బ్రెండన్‌ టేలర్‌ బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉండిన ఓ భారీ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్‌లో సుదీర్ఘ కెరీర్‌ కొనసాగించిన ఆటగాడిగా అవతరించాడు.  సచిన్‌ తన వన్డే కెరీర్‌ను 22 ఏళ్ల 91 రోజుల పాటు కొనసాగించగా.. టేలర్‌ 22 ఏళ్ల 148 రోజుల తర్వాత కూడా తన వన్డే కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. 

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement