ZIM vs AUS: ట్రవిస్‌ హెడ్‌కు దిమ్మతిరిగే షాక్‌! | ZIM vs AUS: Head Hits New Low As Australia Opener In Zimbabwe | Sakshi
Sakshi News home page

ZIM vs AUS: ట్రవిస్‌ హెడ్‌కు షాకిచ్చిన జింబాబ్వే బౌలర్‌.. చెత్త రికార్డు

Sep 15 2026 3:42 PM | Updated on Sep 15 2026 4:05 PM

ZIM vs AUS: Head Hits New Low As Australia Opener In Zimbabwe

ట్రవిస్‌ హెడ్‌ (PC: CA/X)

జింబాబ్వేతో తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ పూర్తిగా విఫలమయ్యాడు. ఐదు బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ కేవలం ఒక ఫోర్‌ బాది పెవిలియన్‌ చేరాడు. ఈ క్రమంలో జింబాబ్వే గడ్డ మీద అత్యల్ప స్కోరుకే అవుటైన ఆసీస్‌ ఓపెనర్‌గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.

మూడు వన్డేల సిరీస్‌
కాగా వన్డే ప్రపంచకప్‌-2027 సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేల సిరీస్‌ను మంగళవారం మొదలుపెట్టింది. హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదికగా తొలి వన్డేలో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

క్లీన్‌ బౌల్డ్‌
ఈ క్రమంలో రెండో ఓవర్లో జింబాబ్వే పేసర్‌ బ్రాడ్‌ ఎవాన్స్‌ బంతితో రంగంలోకి దిగగా.. రెండో బాల్‌కు ఫోర్‌ బాది హెడ్‌ తన పరుగుల ఖాతా తెరిచాడు. అయితే, అదే ఓవర్లో ఐదో బంతికే ఎవాన్స్‌ అద్భుత బంతితో హెడ్‌ను బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో షాట్‌కు యత్నించిన హెడ్‌ బౌల్డ్‌ అయి తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.

భారీ అంచనాలతో బరిలోకి దిగిన మొత్తంగా ఐదు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి నిష్క్రమించాడు. దీంతో హెడ్‌ షాట్‌ సెలక్షన్‌ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. జింబాబ్వే గడ్డ మీద అత్యల్ప వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆసీస్‌ ఓపెనర్‌గా ట్రవిస్‌ హెడ్‌ అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. 

ఇక ఇదే మ్యాచ్‌లో మరో ఓపెనర్‌, ఆసీస్‌ కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ 36 పరుగులు చేసి అవుటయ్యాడు. తద్వారా హెడ్‌తో పాటు ఈ జాబితాలో చేరిపోయాడు.

జింబాబ్వే గడ్డ మీద అత్యల్ప వ్యక్తిగత స్కోర్లు నమోదు చేసిన ఆసీస్‌ ఓపెనర్లు
👉ట్రవిస్‌ హెడ్‌- 4 పరుగులు (హరారే, 2026)
👉ఆడం గిల్‌క్రిస్ట్‌- 14 పరుగులు(బులవాయో, 1999)
👉మాథ్యూ హెడెన్‌- 34 పరుగులు (బులవాయో, 2003)
👉మిచెల్‌ మార్ష్‌- 36 పరుగులు (హరారే, 2026)
👉బ్రాడ్‌ హాడిన్‌- 46 పరుగులు (హరారే, 2014).

చదవండి: టీమిండియాలో కొందరు కోహ్లిని వ్యతిరేకించారు: భువీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement