కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్న టీమిండియా ప్లేయర్‌ | India Pacer Mukesh Kumar Joins Nottinghamshire For Final Two County Championship Matches, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్న టీమిండియా ప్లేయర్‌

Sep 15 2026 2:50 PM | Updated on Sep 15 2026 3:11 PM

India Pacer Joins Nottinghamshire For County Championship Finale

source: BCCI X

టీమిండియా పేసర్‌ ముకేశ్ కుమార్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నాడు. 2026 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు నాటింగ్‌హామ్‌షైర్ జట్టుతో ఒప్పందం​ చేసుకున్నాడు. ఇవాళ ససెక్స్‌తో జరిగే మ్యాచ్‌తో నాటింగ్‌హామ్‌షైర్ తరఫున అరంగేట్రం చేయనున్నాడు. అనంతరం సెప్టెంబర్ 24న యార్క్‌షైర్‌తో జరిగే మ్యాచ్‌లోనూ ఆడనున్నాడు.

డివిజన్-1 టైటిల్ రేసులో నాటింగ్‌హామ్‌షైర్ ప్రస్తుతం కీలక దశలో ఉంది. రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండటంతో ముకేశ్ రాక ఆ జట్టు బౌలింగ్ విభాగానికి అదనపు బలాన్ని ఇవ్వనుంది. ఇంగ్లండ్ పరిస్థితుల్లో ముకేశ్‌ స్వింగ్, సీమ్ బౌలింగ్ నాటింగ్హమ్‌కు ఉపయోగపడే అవకాశం ఉంది.

నాటింగ్‌హామ్‌షైర్‌తో జతకట్టక ముందు ముకేశ్ దులీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. టోర్నీలో 12 వికెట్లు పడగొట్టి సంయుక్తంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు.

మొత్తంగా ముకేశ్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. 60 మ్యాచ్‌ల్లో 233 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున మూడు టెస్టులు కూడా ఆడిన ముకేశ్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో విస్తృత అనుభవం ఉంది. ముకేశ్‌ టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడు. అయితే ప్రస్తుతం జట్టులో తీవ్ర పోటీ ఉండటంతో అవకాశాలు దొరకడం​ లేదు. నాటింగ్హ్‌షైర్‌ తరఫున సత్తా చాటి తిరిగి జట్టులోకి రావాలని ముకేశ్‌ భావిస్తున్నాడు.

చదవండి: బాబర్‌ ఆజం సంచలన నిర్ణయం!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement