జింబాబ్వే వెటరన్ ప్లేయర్ బ్రెండన్ టేలర్, దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండిన ఓ భారీ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్‌లో సుదీర్ఘ కెరీర్ కొనసాగించిన ఆటగాడిగా టేలర్ అవతరించాడు. సచిన్ తన వన్డే కెరీర్‌ను 22 ఏళ్ల 91 రోజుల పాటు కొనసాగించగా.. టేలర్ 22 ఏళ్ల 148 రోజుల తర్వాత కూడా తన వన్డే కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా టేలర్ ఈ ఘనత సాధించాడు.
40 ఏళ్ల టేలర్ 2004 ఏప్రిల్ 20న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో వన్డే అరంగేట్రం చేశాడు. వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన టేలర్ ఇప్పటివరకు 207 వన్డేలు ఆడి 11 సెంచరీలు, 39 అర్ద సెంచరీల సాయంతో 6704 పరుగులు చేశాడు. జింబాబ్వే తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన బ్యాటర్‌గా కూడా టేలర్ కొనసాగుతున్నాడు.
అత్యంత సుదీర్ఘ వన్డే కెరీర్లు
బ్రెండన్ టేలర్ – 22 ఏళ్ల 148 రోజులు
సచిన్ టెండూల్కర్ – 22 ఏళ్ల 91 రోజులు
సనత్ జయసూర్య – 21 ఏళ్ల 184 రోజులు
జావెద్ మియాందాద్ – 20 ఏళ్ల 272 రోజులు
సీన్ విలియమ్స్ – 20 ఏళ్ల 187 రోజులు
క్రిస్ గేల్ – 19 ఏళ్ల 337 రోజులు
షోయబ్ మాలిక్ – 19 ఏళ్ల 245 రోజులు
రోహిత్ శర్మ – 19 ఏళ్ల 21 రోజులు
అరవింద డి సిల్వా – 18 ఏళ్ల 352 రోజులు
రోహిత్ శర్మకు అవకాశం ఉందా..?
ఈ జాబితాలో ప్రస్తుతం ఆడుతున్న భారత ఆటగాడిగా రోహిత్ శర్మ మాత్రమే ఉన్నాడు. అతడి వన్డే కెరీర్ వ్యవధి 19 ఏళ్ల 21 రోజులు. అయితే టేలర్ రికార్డును అందుకోవడం రోహిత్‌కు అంత సులభం కాదు.
రోహిత్ ప్రస్తుతం 39 ఏళ్ల వయసులో ఉన్నాడు. వన్డే జట్టులో అతడి స్థానం, 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఉంటుందో లేదో గ్యారెంటీ లేదు. ఒకవేళ ఆ ప్రపంచకప్ ఆడినా.. అది టీమిండియా తరఫున అతడి చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల టేలర్ నెలకొల్పిన ఈ సుదీర్ఘ వన్డే కెరీర్ రికార్డును బద్దలు కొట్టడం రోహిత్‌కు సాధ్యం కాకపోవచ్చు.
ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్


