సెయింట్ లూయీస్: కెయిన్స్ కప్ అంతర్జాతీయ మహిళల చెస్ టోర్నిలో భారత నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపికి మరో ‘డ్రా’ ఎదురైంది. భారత్‌తో చెందిన వైశాలి రమేశ్‌బాబుతో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను హంపి డ్రాగా ముగించింది. ఈ పోరులో 34 ఎత్తుల్లో ముగిసింది. బరిలో ఉన్న మరో భారత ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ ఐదో రౌండ్ పోరు కూడా డ్రా అయ్యింది. బిబిసారా అసబయేవా (కజకిస్తాన్)తో జరిగిన ఈ మ్యాచ్ 19 ఎత్తుల్లో సమంగా ముగిసింది. ఐదు రౌండ్‌లు ముగిసిన తర్వాత హంపి 2 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుండగా, 3 పాయింట్లతో దివ్య దేశ్‌ముఖ్ ఐదో స్థానంలో, 1.5 పాయింట్లతో వైశాలి తొమ్మిదో స్థానంలో ఉన్నారు.


